KALYANA SRINIVASA SHINES ON SIMHA VAHANA IN YOGA NARASIMHA ALANKARAM _ సింహ వాహనంపై యోగనరసింహుని అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు

Tirupati, 22 Feb. 22: On the third day of the ongoing annual Brahmotsavam of Sri Kalyana Venkateswara temple in Srinivasa Mangapuram, Simha vahana seva took place.

In the guise of Yoga Narasimha, Sri Kalyana Venkateswara was observed in Ekantam due to Covid restrictions.

DyEO Smt Shanti, AEO Sri Gurumurthy, Superintendent Sri Chengalrayulu, temple Archakas Sri Balaji Rangacharyulu were also present. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

సింహ వాహనంపై యోగనరసింహుని అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు

తిరుప‌తి, 2021 ఫిబ్ర‌వ‌రి 22: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన మంగ‌ళ‌వారం ఉదయం శ్రీనివాసుడు యోగనరసింహుని అలంకారంలో సింహ వాహనంపై అభయమిచ్చారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు వాహనసేవ ఆల‌యంలో ఏకాంతంగా జరిగింది.

శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిష్టిస్తారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతాలవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను సంహరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని సింహ వాహనం ద్వారా శ్రీవారు ప్రభోధిస్తున్నారు.

రాత్రి 7 నుండి 8 గంటల వరకు ముత్యపుపందిరి వాహన సేవ జ‌రుగ‌నుంది.

ఈ వాహన సేవలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయులు, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.