SIMHA VAHANA SEVA OBSERVED _ సింహ వాహనంపై యోగనరసింహుని అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి అభయం
సింహ వాహనంపై యోగనరసింహుని అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి అభయం
తిరుపతి, 2022 జూన్ 12: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం ఉదయం యోగనరసింహుని అలంకారంలో స్వామివారు సింహ వాహనంపై అభయమిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.
స్వామి వారు దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిష్టిస్తారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమైనది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతాలవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా స్వామివారు నిరూపిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాధం, కంకణబట్టార్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
TIRUPATI, 12 JUNE 2022: The Simha vahana Seva was observed in Appalayagunta annual fete on a bright sunny day on Sunday.
On the third day morning, Sri Prasanna Venkateswara as Yoga Narasimha Swamy took a celestial ride on Simha Vahanam.
Temple DyEO Sri Lokanatham, Kankanabhattar Sri Suryakumaracharyulu, Superintendent Smt Srivani and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI