SRI RAMA SHINES ON SURYA PRABHA VAHANA _ సూర్యప్రభ వాహనంపై కోదండరాముడి వైభవం

Tirupati, 19 Mar. 21: As part of the ongoing annual brahmotsavams at Sri Kodandarama Swamy temple in Tirupati, Sri Rama shined bright on Suryaprabha Vahanam on Friday morning.

In view of Covid guidelines, the entire annual fete is taking place in Ekantam.

Spl.Gr.DyEO Smt Parvati and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

సూర్యప్రభ వాహనంపై కోదండరాముడి వైభవం

తిరుపతి, 2021 మార్చి 19: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శుక్ర‌వారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు

సూర్యుడు తేజోనిధి, సకలరోగ నివారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటివల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఔషధాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి.

వాహన సేవ అనంతరం ఉదయం 11.00 నుండి 12.00 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబరి నీళ్ళతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేస్తారు.

కాగా సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వేడుకగా నిర్వహించనున్నారు. రాత్రి 8.00 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవ జరగనుంది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం‌, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.