SRI KAPILESWARA BLESSES ON SURYAPRABHA VAHANA _ సూర్యప్రభ వాహనంపై శ్రీకపిలేశ్వరస్వామివారి కటాక్షం
Tirupati, 23 February 2022: On the second day of the ongoing annual Brahmotsavam held inside the temple in Ekantha in view of Covid-19 guidelines, Sri Kapileswara Swami blessed devotees on Wednesday morning on Surya Prabha vahanam.
Sun God removed darkness with sunshine and blessed devotees with wisdom and strength.
Temple DyEO Sri Subramaniam, superintendent Sri Bhupathi, temple inspector Sri Reddy Shekar and archakas were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
సూర్యప్రభ వాహనంపై శ్రీకపిలేశ్వరస్వామివారి కటాక్షం
తిరుపతి, 2022 ఫిబ్రవరి 23: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన బుధవారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామివారు సూర్యప్రభ వాహనంపై కటాక్షించారు. కోవిడ్ -19 నిబంధనల మేరకు వాహనసేవ ఆలయంలో ఏకాంతంగా జరిగింది.
చీకటిని ఛేదించి లోకానికి వెలుగు ప్రసాదించేవాడు సూర్యుడు. సూర్యుని ప్రభ లోకబంధువైన కోటిసూర్యప్రభామూర్తి శివదేవునికి వాహనమైంది. మయామోహాందకారాన్ని తొలగించే సోమస్కందమూర్తి, భక్తులకు సంసారతాపాన్ని తొలగిస్తున్నాడు.
అనంతరం ఉదయం 9 నుండి 10 గంటల వరకు స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. శ్రీ స్కోమస్కందమూర్తి, శ్రీకామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డిశేఖర్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.