TIRUMALA REVERBERATES TO THE RECITATION OF SUNDARAKANDA PRADHAMA SARGA SLOKAS AKHANDA PATHANAM _ సృష్ఠిలోని సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలి : టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
Tirumala, 7 Jul. 20: Akhanda Pradhama Sarga Sundarakanda Pathanam will bring relief to humanity from Corona: TTD Additional EO Sri AV Dharma Reddy
TTD additional EO Sri AV Dharma Reddy said TTD had taken up spiritual crusade through the Akhanda Pradhama Sarga Sundarakanda Pathanam for health of all living beings across globe from Covid-19 pandemic.
He participated in the recitation of final 211 slokas from Pradhama Sarga in Sundarakanda organised at the Nadaneerajana Mandapam in Tirumala on Tuesday morning.
Later he said that from the beginning of the Covid-19 pandemic the TTD had organised a 62 daylong Dhanvanthri Maha mantra parayanams at Nada Niranjanam. Similarly, on the advice of Veda pundits the TTD has taken up Akhanda Sundarakanda Pathanam from June 11 the seeking relief to human beings from pandemic Covid-19.
He said eminent pundits also explained the significance and meaning of 10 Shlokas whose parayanams were held daily for benefit of devotees. He said as per the legend of Ramayana penned by Sage Valmiki in Pradhama Sarga Lord Hanumanta had surged from Mahendragiri and reached Lanka passing all demon armies. All the parayanams of the 211 shlokas of the Prathama saga were conducted dutifully. It is believed that the Pathanam will please Lord Hanuman and thereby Sri Venkateswara who is also an incarnation of Sri Ramachandra and save the humanity from Covid-19 pandemic.
The Additional EO said 108 Veda pundits of Dharmagiri Veda Pathasala, faculty of the SV Veda University, Veda Parayanadars of SV Institute of Higher Vedic Studies and 58 scholars from Rashtriya Sanskrit Vidya Peetham participated.
TTD JEO Sri P Basant Kumar Srivari temple Dyeo Sri Harindranath, Vice-Chancellor of Vedic Varsity Acharya Sudarshana Sharma, RSVP Vice-Chancellor Acharya Muralidhara Sharma, Dharmagiri Veda Vignana Peetham Principal Sri KSS Avadhani, OSD of SVVHSI Sri Vibhishana Sharma, TTD Astana Musician Dr Garimella Balakrishna Prasad, HoDs of various departments in TTD participated.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
సృష్ఠిలోని సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలి : టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుమల, 2020 జూలై 07: సృష్ఠిలోని సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ సుందరకాండ ప్రథమ సర్గ సంపూర్ణంగా 211 శ్లోకాలతో అఖండ పారాయణం నిర్వహించినట్లు టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఉద్ఘాటించారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం ఉదయం జరిగిన సుందరకాండ ప్రథమ సర్గ అఖండ పారాయణంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుండి తిరుమలలోని నాద నీరాజనం వేదికపై “యోగవాశిష్ఠం – శ్రీ ధన్వంతరి మహామంత్రం” ను 62 రోజుల పాటు పారాయణం చేసినట్లు తెలిపారు. ప్రపంచాన్ని కరోనా నుండి రక్షించేందుకు ప్రముఖ పండితుల సూచనల మేరకు జూన్ 11వ తేదీ నుండి సుందరకాండ పారాయణం ప్రారంభించామన్నారు. ఇందులోని శ్లోకాలను భక్తులతో పలికించి అర్థ తాత్పర్యాలతో పాటు ఆ శ్లోక ఉచ్చారణ వలన కలిగే ఫలితం, నేటి ఆధునిక సమాజంలోని మానవాళికి ఏవిధమైన సందేశం ఇస్తుందో వివరిస్తూ ప్రతి రోజు 10 శ్లోకాలను నిరంతరాయంగా పఠించామన్నారు.
వాల్మీకి మహర్షి రామాయణంలోని సుందరకాండ ప్రథమ సర్గలో చెప్పిన విధంగా హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం నుండి లంఘించి సముద్రాన్ని దాటుకుంటూ కార్యదీక్షతో అవిశ్రాంతంగా ప్రయాణించి లంకకు చేరుకున్నాడని చెప్పారు. అదేవిధంగా, ప్రథమసర్గలోని 211 శ్లోకాలను అవిశ్రాంతంగా పఠించినట్లు వివరించారు. ఇలా చేయడం వల్ల హనుమంతుడు సంతోషిస్తాడని, తద్వారా శ్రీరామచంద్రమూర్తి అవతారమైన శ్రీ వేంకటేశ్వరుడు ప్రసన్నమై కరోనా వ్యాధిని మానవాళి నుండి దూరం చేస్తాడన్నారు.
అఖండ పారాయణంలో 108 మంది వేద పండితులు, ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణ దారులు, 58 మంది రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంకు చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్, ఎస్వీ వేద వర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య సన్నిధానం సుదర్శనశర్మ, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య మురళిధర్ శర్మ, ఎస్వీ వేద ఉన్నత వేద అధ్యాయన సంస్థ ప్రత్యేకాధికారి శ్రీ విభీషణ శర్మ, టిటిడి ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.