సెక్యూరిటీ సూపర్‌వైజర్ల అవగాహనా సదస్సు

సెక్యూరిటీ సూపర్‌వైజర్ల అవగాహనా సదస్సు

తిరుపతి, ఏప్రిల్‌  -18, 2011: ప్రపంచములోనే అతిపెద్ద ధార్మిక సంస్థగా వెలుగొందుతున్న తితిదేకి సంరక్షణ కల్పించడంలో భద్రతావిభాగం ఎంతో బాధ్యతాయుతంగా అప్రమత్తతతో  వ్యవహరించాలని తితిదే ముఖ్య నిఘా అధికారి శ్రీ యమ్‌.కె.సింగ్‌ అన్నారు.

సోమవారం నాడు శ్వేత భవనంలో సెక్యూరిటీ సూపర్‌ వైజర్లకు భద్రతపై అవగాహనా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీ సింగ్‌ మాట్లాడుతూ సెక్యూరిటీ సిబ్బంది సరిగా తమ విధి నిర్వహణను నిర్వర్తిస్తున్నారా అన్న విషయాన్ని ఎంతో జాగరూకతతో సెక్యూరిటీ సూపర్‌వైజర్లు గమనిస్తూవుండాలన్నారు. వీరికి చాకచక్యం ఎంతో అవసరమన్నారు. విధినిర్వహణలో ఎటువంటి చిన్నపొరబాటును కూడా చేయకుండా తితిదేకి సంరక్షకులుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.    

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.