PAVITROTSAVAMS IN CHENNAKESAVA TEMPLE _ సెప్టెంబరు 1 నుండి 3వ తేదీ వరకు తాళ్లపాక శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు
TIRUPATI, 28 AUGUST 2022: The annual Pavitrotsavams in Sri Chennakeshava Swamy temple in Tallapaka district will be observed between September 1 and 3 with Ankurarpanam on August 31.
On first day, Pavita Homam, Second-day Pavitra Samarpana and on the final day Pavitra Purnahuti will be performed.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సెప్టెంబరు 1 నుండి 3వ తేదీ వరకు తాళ్లపాక శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు
తిరుపతి, 2022 ఆగస్టు 28: తాళ్లపాక శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు సెప్టెంబరు 1 నుండి 3వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. ఆగస్టు 31న సాయంత్రం పుణ్యహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం నిర్వహిస్తారు.
యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 1న చతుష్టానార్చన, బింబారాధన, మండలారాధన, కుంబారాధన, కుండలారాధన, పవిత్రహవనం, పవిత్రహోమం, శాత్తుమొర నిర్వహిస్తారు. సెప్టెంబరు 2న పవిత్ర సమర్పణ, నిత్య హోమాలు, సెప్టెంబరు 3న పూర్ణాహుతి, పవిత్రవితరణ, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగనున్నాయి.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.