సెప్టెంబరు 4న ఎస్వీ సంగీత కళాశాలలో శ్రీ నారాయణదాస విగ్రహావిష్కరణ
సెప్టెంబరు 4న ఎస్వీ సంగీత కళాశాలలో శ్రీ నారాయణదాస విగ్రహావిష్కరణ
తిరుపతి, సెప్టెంబరు 03, 2013: హరికథా పితామహుడు శ్రీ ఆదిభట్ట నారాయణదాస 149వ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబరు 4న తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ప్రాంగణంలో ఆయన శిలావిగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరుగనుంది. ఉదయం 7.42 గంటలకు సుప్రసిద్ధ తెలుగు చలనచిత్ర దర్శకులు డాక్టర్ కె.విశ్వనాథ్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
నారాయణదాస జయంతి సందర్భంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఏడు రోజుల పాటు హరికథా సప్తాహం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నాలుగో రోజైన బుధవారం ఎస్వీ సంగీత కళాశాలలో విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటుచేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.