NARAPURA PAVITROTSAVAMS _ సెప్టెంబ‌రు 5 నుండి 7వ తేదీ వ‌ర‌కు జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప‌విత్రోత్స‌వాలు 

TIRUPATI, 28 AUGUST 2022: The annual Pavitrotsavams of Sri Narapura Venkateswara Swamy in Jammalamadugu will be held between September 5 and 7.

 

In connection with this, Ankurarpanam will be held on September 4.

 

Pavitra Pratistha on September 5, Pavitra Samarpana on September 6 and Pavitra Purnahuti will be rendered on September 7.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సెప్టెంబ‌రు 5 నుండి 7వ తేదీ వ‌ర‌కు జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప‌విత్రోత్స‌వాలు

తిరుపతి, 2022 ఆగ‌స్టు 28: జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు సెప్టెంబ‌రు 5 నుండి 7వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. సెప్టెంబ‌రు 4న సాయంత్రం పుణ్యహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం నిర్వ‌హిస్తారు.

సెప్టెంబ‌రు 5న‌ చ‌తుష్టార్చాన‌, అగ్ని ప్ర‌తిష్ట‌, ప‌విత్ర ప్ర‌తిష్ట, సాయంత్రం 6 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్నారు. సెప్టెంబరు 6న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 7న పూర్ణాహుతి, పవిత్రవితరణ, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగనున్నాయి.

యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.