సెప్టెంబరు 9న శ్రీ కపిలేశ్వరాలయంలో వినాయక చవితి వేడుకలు

సెప్టెంబరు 9న శ్రీ కపిలేశ్వరాలయంలో వినాయక చవితి వేడుకలు

తిరుపతి, సెప్టెంబరు 06, 2013: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 9న వినాయక చవితి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ కొలువైన పార్వతీ పుత్రుడైన వినాయకస్వామివారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు గణనాథుడు మూషిక వాహనాన్ని అధిరోహించి తిరువీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రత్యేక సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది