ANNUAL BTU OF SRIVARI TEMPLE FROM SEPT 19-27 _ సెప్టెంబ‌రు 19 నుండి 27వ తేదీ వ‌ర‌కు ఏకాంతంగా శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు

Tirumala, 9 Sep. 20: TTD is organising the annual Brahmotsavam of Srivari temple at Tirumala from September 19-27 with Ankurarpanam on September 18 and Koil Alwar Tirumanjanam on September 15.

With a view to reduce the impact of ongoing pandemic COVID-19, the annual festival is being held in Ekantkam this year.

Following are details of the programs.

September 19 – Dwajarohanam 

September 23 – Garuda seva 

September 24 and 26-Sarvabhoopala Vahanam in place of Swarna Ratham 

Rathotsavam respectively in view of COVID.

September 27-Chakra Snanam and Dwajavarohanam.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబ‌రు 19 నుండి 27వ తేదీ వ‌ర‌కు ఏకాంతంగా శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు
 
తిరుమల, 2020 సెప్టెంబ‌రు 09: తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు సెప్టెంబ‌రు 19 నుండి 27వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. సెప్టెంబ‌రు 18న అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు.  బ్ర‌హ్మోత్స‌వాల నేప‌థ్యంలో సెప్టెంబ‌రు 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జ‌రుగ‌నుంది. క‌రోనా వ్యాధి వ్యాప్తిని అరిక‌ట్టే చ‌ర్య‌ల్లో భాగంగా, భ‌క్తుల‌కు, టిటిడి ఉద్యోగుల‌కు ఈ వ్యాధి వ్యాపించ‌కుండా నివారించేందుకు ఈ బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. ఈ ఉత్స‌‌వాల్లో విశేష‌మైన రోజుల వివ‌రాలిలా ఉన్నాయి.
 
సెప్టెంబ‌రు 19న – ధ్వ‌జారోహ‌ణం
 
సెప్టెంబ‌రు 23న – గ‌రుడ‌సేవ‌
 
సెప్టెంబ‌రు 24న – స్వ‌ర్ణ‌ర‌థోత్స‌వం(స‌ర్వ‌భూపాల వాహ‌నం) 
 
సెప్టెంబ‌రు 26న – ర‌థోత్స‌వం(స‌ర్వ‌భూపాల వాహ‌నం)
 
సెప్టెంబ‌రు 27న – చ‌క్ర‌స్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణం.
 
కాగా, కోవిడ్-19 నిబంధనల నేపథ్యంలో సెప్టెంబ‌రు 24న స్వ‌ర్ణ‌ర‌థోత్స‌వం, సెప్టెంబ‌రు 26న ర‌థోత్స‌వం ఉండని కారణంగా ఈ రెండు రోజుల్లో సర్వభూపాల వాహనంపై శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి వేంచేపు చేస్తారు.
 
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.