స్వచ్ఛందసేవా సంస్థలకు ఆహ్వానం
స్వచ్ఛందసేవా సంస్థలకు ఆహ్వానం
తిరుపతి, 2010 జనవరి 06: తిరుమల పుణ్యక్షేత్రానికి వేలాది మంది భక్తులు వచ్చేస్తుంటారు. వీరికి తగు సమాచారం ఇచ్చేందుకై ఏర్పాటు చేసిన సమాచార కేంద్రాలను సేవాభావంతో ఉచితంగా నిర్వహించడానికి స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు, దాతలను తి.తి.దే. ఆహ్వానిస్తున్నది.
తిరుమల, తిరుపతి, తిరుచానూరు, రేణిగుంటలలో ఏర్పాటు చేసిన సమాచార కేంద్రాలలో ప్రస్తుతం సీనియర్ సిటిజన్లు భక్తులకు సమాచారం అందిస్తున్నారు. అయితే ఈ సమాచార కేంద్రాల నిర్వహణకు ఆధ్యాత్మిక, స్వచ్ఛంద సేవా సంస్థలకు అవకాశం ఇవ్వాలని తి.తి.దే భావిస్తోంది.
కనుక దేశంలోని ఏ ఆధ్యాత్మిక, స్వచ్ఛంద సేవా సంస్థలైనా, వాటి అనుబంధ సంస్థలైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సమాచార కేంద్రాల నిర్వహణ ద్వారా తిరుమలకు విచ్చేసే వేలాది మంది భక్తుల సేవలో తరించి శ్రీవారి కృపకు పాత్రులు కావాలని ఆంకాక్ష.
భక్తుల సేవయే భగవంతుని సేవ!!
వివరాలకు సంప్రదించండి: ప్రజాసంబంధాధికారి, తి.తి.దేవస్థానములు, తిరుపతి.
ఫోన్ నెం.0877-2264217, 2264392.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.