GRAND SWARNA RATHOTSAVAM HELD ON VAIKUNTA EKADASI DAY _ వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేడుకగా స్వర్ణరథోత్సవం

Tirumala 23 December 2023: Devotees had a feast of Bhakti unfurled on Vaikunta Ekadasi day with the Swarna Rathotsavam

on Mada streets on Saturday.

 

Sri Malayappa Swami and His consorts took out a celestial ride on the Swarna Ratham to bless the sea of devotees who thronged Tirumala as the Ratham richly decorated with flowers was drawn by TTD women employees and women devotees chanting Govinda Nama.

 

TTD Chairman Sri Bhumana Karunakar Reddy, EO Sri AV Dharma Reddy, several board members, JEOs Smt Sada Bhargavi and Sri Veerabrahmam and officials were present.

 
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేడుకగా స్వర్ణరథోత్సవం

తిరుమల, 23 డిసెంబ‌రు 2023: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ‌నివారం స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది.

శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు రథాన్ని అధిరోహించి నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వర్ణరథాన్ని టీటీడీ మహిళా ఉద్యోగులతో పాటు పలువురు మహిళలు గోవిందనామస్మరణతో, భక్తిశ్రద్ధలతో లాగారు. స్వర్ణరథోత్సవాన్ని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులు దర్శించుకున్నారు.

టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జేఈవో లు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.