SWARNA RATHAM PROCESSION TOOK PLACE WITH RELIGIOUS FERVOUR _ స్వ‌ర్ణ‌ర‌థంపై మెరిసిన సిరుల‌త‌ల్లి

TIRUPATI, 25 NOVEMBER 2022: The glory, shine, charm of Swarna Ratham-the golden chariot enhanced on Friday evening, with the chariot being pulled by scores of enthusiastic women devotees who witnessed the majesty of Goddess Sri Padmavathi Devi with utmost devotion.

Usually all other carriers are being pulled by the Vahanam bearers its only the two chariots, Golden and Wooden which gives the devotees the divine opportunity of dragging the cars. And especially the golden chariot provides an exclusive opportunity to the women folk who takes the credit of pulling the giant ratham. The spouses of TTD officials also participated.

TTD Board Ex-officio Dr C Bhaskar Reddy, board members Sri Ashok Kumar, Sri Ramulu, JEO Sri Veerabrahmam, VGOs Sri Bali Reddy, Sri Manohar, DyEO Sri Lokanatham, Agama Advisor Sri Srinivasacharyulu, Archaka Sri Babu Swamy, AEO Sri Prabhakar Reddy and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

స్వ‌ర్ణ‌ర‌థంపై మెరిసిన సిరుల‌త‌ల్లి

తిరుపతి, 2022 నవంబరు 25: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం సాయంత్రం అమ్మ‌వారు స్వ‌ర్ణ‌ర‌థంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. సాయంత్రం 4.20 గంటల నుండి ఆల‌య మాడ వీధుల్లో ఈ ఉత్స‌వం జ‌రిగింది.

కాంతులీనుతున్న స్వర్ణ రథంపై శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారు విశేష స్వ‌ర్ణ‌, వ‌జ్రాభ‌ర‌ణాల‌ను ధ‌రించి భ‌క్తుల‌కు కనువిందు చేశారు. పెద్ద‌సంఖ్య‌లో మ‌హిళ‌లు పాల్గొని స్వ‌ర్ణ‌ర‌థాన్ని లాగారు.

ఈ కార్య‌క్ర‌మంలో చంద్రగిరి ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, శ్రీ రాములు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు విఎస్వోలు శ్రీ బాల్ రెడ్డి, శ్రీ మనోహర్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ శ్రీ‌నివాసాచార్యులు, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు
శ్రీ బాబు స్వామి, ఆర్జిత ఇన్స్పెక్టర్ శ్రీ దాము పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.