FREE FOOD FACILITY TO SVIMS STUDENTS- TTD _ EOస్విమ్స్ విద్యార్థులకు ఉచిత భోజన సదుపాయం -. టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి

Tirupati, 01 August 2022: TTD EO Sri AV Dharma Reddy said that students of Physiotherapy, nursing and other para-medical students of SVIMS would henceforth be provided free meals facilities on par with students of other TTD educational institutions.

 

Along with SVIMS Director Dr Vengamma, JEOs Smt Sada Bhargavi and Sri Veerabrahmam, TTD EO on Monday evening inspected the canteens of several wings of SVIMS hospital.

 

He said a separate canteen would be operated for SVIMS patients, their attendants, doctors and others and steps will be taken for the modernisation of the RO water plant at the Boys hostel.

 

He also sought suggestions and proposals from UG and PG students on how good they could develop their hostels.

 

He also inspected the shelters for patients, canteens outside SVIMS, officers canteen, general ward dining hall, boys and girls hostel, PG hostel and Padmavati hospital canteen and directed officials for keeping it clean, green and hygienic.

 

FA & CAO Sri Balaji, CE Sri Nageswara Rao, Sri Padmavati Medical College Principal Dr Sharan, Medical Superintendent Dr Ram and others were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

స్విమ్స్ విద్యార్థులకు ఉచిత భోజన సదుపాయం -. టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి

తిరుపతి 1 ఆగస్టు 2022: స్విమ్స్ లో చదువుతున్న ఫిజియో థెరపీ , నర్సింగ్ , పారా మెడికల్ విద్యార్థినీ విద్యార్థులకు టీటీడీ విద్యాసంస్థల్లో లాగా ఉచిత భోజన సదుపాయం కల్పిస్తామని టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి తెలిపారు.

జెఈవో లు శ్రీమతి సదా భార్గవి , శ్రీ వీరబ్రహ్మం , స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ తో కలసి సోమవారం సాయంత్రం ఆయన స్విమ్స్ లోని పలు విభాగాల క్యాంటీన్లను పరిశీలించారు .

స్విమ్స్ లోని రోగులు వారి సహాయకులు ,డాక్టర్లు , ఇతర సిబ్బందికి ప్రత్యేకంగా క్యాంటీన్ సౌకర్యం పెంచేందుకు , బాయ్స్ హాస్టల్లో ఆర్ ఓ ప్లాంట్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామన్నారు .ఆసుపత్రి వద్ద రోగులు వేచి ఉండే షెల్టర్ ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు . యూజి ,పిజి విద్యార్థులు తమ హాస్టల్ ను తామే ఎలా నిర్వహించుకునే విషయంపై కొత్త ప్రతిపాదనలతో రావాలన్నారు . ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు . స్విమ్స్ బయట ఉన్న క్యాంటీన్ ,ఆఫీసర్స్ క్యాంటీన్ , జనరల్ వార్డ్ డైనింగ్ హాల్ , బాలురు ,బాలికల హాస్టల్ ,పిజి హాస్టల్ , పద్మావతి హాస్పిటల్ క్యాంటీన్ లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 

ఎఫ్ ఎ సి ఎ ఓ శ్రీ బాలాజి , చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు , శ్రీ పద్మావతి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శరన్ , మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తదితరులు పాల్గొన్నారు .

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది