TTD EO INAUGURATES NEW KITCHEN AT SVIMS _ స్విమ్స్ విద్యార్థులకు ఉచితంగా భోజనం – నూతన వంటశాలను ప్రారంభించిన టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
FREE MEALS TO SVIMS STUDENTS
Tirupati, 09 September 2022: TTD EO Sri AV Dharma Reddy on Friday inaugurated a new kitchen at SVIMS hospital aimed at providing free food to students studying Physiotherapy, Nursing and Para medical courses.
He also inspected the brand new kitchen appliances and cooking systems and menu and interacted with kitchen staff and as well students.
Later he said TTD board had decided to provide free food to nearly 800 students as Srivari Anna Prasadam and to stop the system of collecting ₹3500 from students and supply of food through a canteen contractor.
He said the TTD initiative helped reduce the financial burden on parents of students and asked students to inform their parents that TTD provided free accommodation for breakfast, lunch, evening snacks and dinner.
He said the students should form teams to clean the hostel rooms and the kitchen daily. The warden and deputy warden should supervise the hostel rooms and kitchen regularly and ensure against issues.
He cautioned strict action on supervision staff and also students if they fail in observing discipline and against misconduct.
They should also guard and avert wastage of power and water in the hostel and classrooms, he added.
TTD JEO Sri Veerabrahmam, SVIMS Director Dr Vengamma, CE Sri Nageswara Rao, Devasthanams Education Officer Sri Govindarajan, DyEO Canteens Sri Subramaniam, Catering Special Officer Sri GLN Shastry, SVIMS RMO Dr Ram, Chief Dietician Smt Sunita were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
స్విమ్స్ విద్యార్థులకు ఉచితంగా భోజనం
– నూతన వంటశాలను ప్రారంభించిన టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుపతి, 2022 సెప్టెంబరు 09: స్విమ్స్‌లో ఫిజియోథెరపీ, నర్సింగ్, పారామెడికల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా భోజన సదుపాయం కల్పించడం కోసం ఏర్పాటుచేసిన నూతన వంటశాలను టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటుచేసిన వంటశాలలోని సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులకు తయారుచేసే ఆహారానికి సంబంధించిన మెను గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఈవో విద్యార్థులు, హాస్టళ్ల సిబ్బందితో మాట్లాడారు. విద్యార్థుల నుంచి నెలకు రూ.3500/- వసూలు చేసి కాంట్రాక్టర్ ద్వారా ఇప్పటివరకు భోజన సదుపాయం కల్పించేవారని చెప్పారు. టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి నిర్ణయం మేరకు విద్యార్థులందరికీ ఉచితంగా స్వామివారి అన్నప్రసాదం అందిస్తున్నట్టు తెలిపారు. 800 మంది విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ నిర్ణయం వల్ల కొంతమేరకైనా ఆర్థికభారం తగ్గుతుందని ఈవో చెప్పారు. టిటిడి తమకు ఉచితంగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజన వసతి కల్పిస్తోందని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. విద్యార్థులు 30 బృందాలుగా ఏర్పడి ప్రతిరోజూ హాస్టల్ గదులు, వంటశాలను శుభ్రం చేసుకోవాలని చెప్పారు. అలాగే, హాస్టళ్ల సమీపంలో ఉన్న పార్కును కూడా చక్కగా నిర్వహించుకోవాలన్నారు. వార్డెన్, డెప్యూటీ వార్డెన్ ఎప్పటికప్పుడు హాస్టళ్లను, వంటశాలను పరిశీలించి సమస్యల్లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాకాని పక్షంలో కఠినమైన చర్యలు తప్పవన్నారు. విద్యార్థులు కూడా క్రమశిక్షణ, సత్ప్రవర్తనతో వ్యవహరించకపోతే వారి మీద కూడా చర్యలు తీసుకుంటామన్నారు. హాస్టళ్లు, కళాశాల తమవి అనే భావనతో వ్యవహరిస్తూ విద్యుత్, నీటిని వృథా చేయరాదని చెప్పారు.
జెఈవో శ్రీ వీరబ్రహ్మం, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, డిఈవో శ్రీ గోవిందరాజన్, క్యాంటీన్స్ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రహ్మణ్యం, అన్నదానం ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి, స్విమ్స్ ఆర్ఎంవో డాక్టర్ రామ్, చీఫ్ డైటీషియన్ శ్రీమతి సునీత పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.