SRI KAPILESWARA SWAMY RIDE ON SWAN CARRIER _ హంస వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారి అభయం

 – IMPRESSIVE MUSIC AND DANCE PERFORMANCES

Tirupati, 01 March 2024: On the first day of Sri Kapileswara Swamy Brahmotsavam in Tirupati, Sri Kapileswara Swamy offered blessings to the devotees in the streets on the Swan carrier from 7 to 9 pm on Friday. 

Temple Deputy EO Sri. Devendra Babu, AEO Sri. Subbaraju, Superintendent Sri. Bhupathi, Temple Inspectors Sri. Ravikumar and Sri Balakrishna participated in this program.

Impressive music and dance performances

The music and dance programs organized by Sri Venkateswara College of Music and DanceCollege and Sri Venkateswara Nadaswara and Dolu School on the first day of the annual Brahmotsavam of Sri Kapileswara Swamy on Friday night were impressive.

As a part of this, Nadaswara and Dolu concert was performed on the stage set up in the temple premises. 

In this, Sri Kesanna, Sri Venkanna on Nadaswaram, Sri Nagaraju and Sri Chandrasekhar on the drums performed with amazing rhythm. 

Similarly, vocal lecturer Dr. Vandana with her disciple group performed a vocal concert.

College Principal Dr.  Uma Muddubala and others participated.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

హంస వాహనంపై శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి అభ‌యం

•⁠ ⁠ఆకట్టుకున్న సంగీత, నృత్య కార్యక్రమాలు

తిరుప‌తి, 2024, మార్చి 01: తిరుప‌తిలోని శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల్లో మొద‌టి రోజైన శుక్ర‌వారం రాత్రి 7 నుండి హంస వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు తిరుపతి పురవీధుల్లో భ‌క్తుల‌కు అభ‌య‌మిచ్చారు. గ‌జ‌రాజులు ముందు న‌డుస్తుండ‌గా క‌ళాబృందాల కోలాటాలు, భ‌జ‌నల న‌డుమ వాహ‌న‌సేవ కోలాహ‌లంగా జ‌రిగింది. భ‌క్తులు అడుగ‌డుగునా క‌ర్పూర‌హార‌తులు స‌మ‌ర్పించారు.

ఆది దంపతులైన స్వామి, అమ్మవార్లు హంస మిథునం(దంపతులు)లా గోచరిస్తారు. వారి వల్లనే అష్టాదశ విద్యలు పరిణమించాయి. పాలను, నీటిని వేరు చేసే వివేకం అలవడింది. కపిలాది యోగీశ్వరుల మానస సరస్సులో హంస జంటగా స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ జి.దేవేంద్ర బాబు, ఏఈవో శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ భూపతి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ పాల్గొన్నారు.

ఆకట్టుకున్న సంగీత, నృత్య కార్యక్రమాలు

శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తొలిరోజైన శుక్రవారం రాత్రి శ్రీ వెంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల మరియు శ్రీ వెంకటేశ్వర నాదస్వర, డోలు పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత, నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై నాదస్వర, డోలు కచేరి అలరించింది. ఇందులో శ్రీ కేసన్న, శ్రీ వెంకన్న నాదస్వరంపై, శ్రీ నాగరాజు, శ్రీ చంద్రశేఖర్ డోలుపై అద్భుతంగా లయ విన్యాసం చేశారు. అదేవిధంగా కళాశాల అధ్యాపకురాలు డా. వందన, వారి శిష్య బృందం గాత్ర కచేరి వీనులవిందుగా సాగింది. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఉమా ముద్దుబాల తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.