HAMSA VAHANAM HELD _ హంస వాహనంపై సరస్వతి అలంకారంలో గోవిందుని అభయం
TIRUPATI, 17 MAY 2024: On the Second evening of the ongoing annual Brahmotsavam in Sri Govindaraja Swamy temple in Tirupati, Sri Govindaraja in Saraswati Alankaram atop Hamsa Vahanam blessed His devotees on Friday.
Both the Pontiffs of Tirumala, FACAO Sri Balaji, DyEO Smt Shanti and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
హంస వాహనంపై సరస్వతి అలంకారంలో గోవిందుని అభయం
తిరుపతి, 2024 మే 17: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం రాత్రి స్వామివారు సరస్వతి దేవి అలంకారంలో హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది.
వాహనం ముందు వృషభాలు, అశ్వాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
హంస వాహనం – బ్రహ్మ పద ప్రాప్తి
హంస వాహనసేవలో శ్రీ గోవిందరాజ స్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, ఎఫ్ ఏ అండ్ సిఏఓ శ్రీ బాలాజీ, ఆగమ సలహాదారులు శ్రీ సీతారామాచార్యులు, శ్రీ మోహన రంగాచార్యులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, సూపరింటెండెంట్ శ్రీ మోహన రావు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనుంజయులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.