SARASWATI DEVI ALANKARAM ON HAMSA VAHANAM _ హంస వాహనంపై సరస్వతీ దేవి అలంకారంలో శ్రీవేణుగోపాలస్వామి

Tirupati, 30 May 2024: On the second day of the Karvetinagaram Sri Venugopalaswamy Brahmotsavam, the Swamy graced the devotees by riding on a finely decked divine swan carrier in Saraswati Devi Alankaram on Thursday night.
 
Temple Deputy EO Smt.Nagaratna, AEO Sri. Parthasarathy, Superintendent in  Sri Somasekhar, temple priests and a large number of devotees participated.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

హంస వాహనంపై సరస్వతీ దేవి అలంకారంలో శ్రీవేణుగోపాలస్వామి

తిరుపతి, 2024 మే 30: కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు గురువారం రాత్రి 7 గంటలకు సరస్వతి దేవి అలంకారంలో శ్రీ వేణుగోపాల స్వామి హంస వాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు.

మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతుల సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

వాహన సేవలో ఆలయ డిప్యూటీఈఓ శ్రీమతి నాగరత్న, ఏఈఓ శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్ శ్రీ సోమశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.