HANUMANTA VAHANAM HELD _ హ‌నుమంత‌ వాహనంపై శ్రీ కోదండ‌రామ‌స్వామి అలంకారంలో వేణుగోపాలుడి అభ‌యం

TIRUPATI, 03 JUNE 2024: On the sixth day as part of Karvetinagaram annual Brahmotsavams Sri Venugopala Swamy took out a celestial ride on Hanumanta Vahanam as Kodandarama to bless His devotees.
 
AEO Parthasaradhi, Superintendent Sri Soma Sekhar, other staff and devotees were present.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

హ‌నుమంత‌ వాహనంపై శ్రీ కోదండ‌రామ‌స్వామి అలంకారంలో వేణుగోపాలుడి అభ‌యం

తిరుప‌తి, 2024 జూన్ 03: కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆర‌వ రోజైన‌ సోమ‌వారం ఉదయం 7.30 గంటలకు శ్రీ కోదండ‌రామ‌స్వామి అలంకారంలో హ‌నుమంత‌ వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి భక్తులకు అభ‌య‌మిచ్చారు.

మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతుల సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

వాహన సేవలో ఆలయ ఏఈఓ శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్‌ శ్రీ సోమ శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.