హిందూ ధర్మప్రచార ఆధ్వర్యంలో విద్యార్థులకు రామాయణం కంఠస్థ పోటీలు

హిందూ ధర్మప్రచార ఆధ్వర్యంలో విద్యార్థులకు రామాయణం కంఠస్థ పోటీలు

తిరుపతి 19 మార్చి 2022: శ్రీరామనవమి సందర్భంగా తిరుపతి నగరం లోని విద్యార్థినీ, విద్యార్థులకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ రామాయణ కంఠస్థ పోటీలు నిర్వహించనుంది. ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 9 గంటలకు అన్నమాచార్య కళామందిరం లో ఈ పోటీలు జరుగుతాయి.

పదేళ్ళ లోపు విద్యార్థినీ, విద్యార్థులకు నామ రామాయణం అనే అంశం మీద పోటీలు నిర్వహిస్తారు. 10 నుంచి 15 ఏళ్ళ లోపు వయసు గల విద్యార్థినీ, విద్యార్థులకు బాల రామాయణం అనే అంశం మీద పోటీలు జరుగుతాయి. ఆసక్తి ఉన్న విద్యార్థీ విద్యార్థులు ఏప్రిల్ 9 వ తేదీ ఉదయం 9 గంటలకు హాజరై పేర్లు నమోదు చేయించుకోవాలి. విజేతలకు అదే రోజు అక్కడే బహుమతులు ప్రదానం చేస్తారు. మరిన్ని వివరాలకు 9676615643 మొబైల్ నంబర్ లో కార్యాలయ పనివేళల్లో సంప్రదించవచ్చు

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది