TOUGH COMPETITION IN GAMES AND SPORTS _ హోరాహోరీగా టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీలు
TIRUPATI, 09 FEBRUARY 2023: The competitions in the annual Games and Sports Meet for TTD employees are getting tougher day by day.
On Thursday Table Tennis, Carroms singles and doubles, Kabaddi were conducted for women and men employees aged above and below 45 years.
The employees took part with great sportive spirit and enthusiasm.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
హోరాహోరీగా టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీలు
తిరుపతి, 09 ఫిబ్రవరి 2023: టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం జరిగిన పోటీల వివరాలు ఇలా ఉన్నాయి.
– అంధ ఉద్యోగుల చెస్ పోటీల్లో బి.బాబు నాయుడు విజేతగా నిలవగా, ఇ.దేవేంద్రనాథ్ రన్నరప్ గా నిలిచారు.
– బధిర ఉద్యోగుల చెస్ పోటీల్లో బి.శ్రీకాంత్ విజేతగా నిలవగా, ఎం.శ్రీబాబు రన్నరప్ గా నిలిచారు.
– బధిర మహిళల చెస్ పోటీల్లో బి.గౌరి విజేత కాగా, కె.మునివెంకట ప్రసన్న రన్నరప్ గా నిలిచారు.
– 45 ఏళ్లు పైబడిన పురుషుల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ పోటీల్లో ఎం.కిరణ్ కుమార్ రాజు విజేత కాగా, పి.ఆంజనేయులు రన్నరప్ గా నిలిచారు.
– 45 ఏళ్లు పైబడిన పురుషుల టేబుల్ టెన్నిస్ డబుల్స్ పోటీల్లో టి.మురళి, పి.ఆంజనేయులు విజయం సాధించగా, ఎం.కిరణ్ కుమార్ రాజు, కె.కృష్ణమూర్తి రన్నర్స్ గా నిలిచారు.
– 45 ఏళ్ల లోపు మహిళల క్యారమ్స్ సింగిల్స్ పోటీల్లో జి.అలేఖ్య విజేత కాగా, డా. బి.గిరిజా కుమారి రన్నరప్ గా నిలిచారు.
– 45 ఏళ్ల లోపు మహిళల క్యారమ్స్ డబుల్స్ పోటీల్లో జి.అలేఖ్య, కె.సౌజన్య విజయం సాధించగా, డా. బి.గిరిజా కుమారి, జె.హెచ్.స్వప్న మంజరి రన్నర్స్ గా నిలిచారు.
– కామన్ కేటగిరీ పురుషుల కబడ్డీ పోటీల్లో బి.రామకృష్ణ జట్టు విజయం సాధించగా, పి.దామోదర్ రెడ్డి జట్టు రన్నరప్ గా నిలిచింది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.