DEVI NAVARATRI CELEBRATIONS AT THUMMUR TEMPLE FROM OCTOBER 11 TO 20 _ అక్టోబరు 11 నుంచి 20 వరకు తుమ్మూరు శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు

GODDESS TO BLESS DEVOTEES IN DIFFERENT DIVINE ALANKARAMS

Tirupati, October 5, 2026: Devi Navaratri celebrations will be conducted grandly by TTD at Sri Kariyamanikya Swamy and Sri Neelakanteswara Swamy Temple in Thummur village of Naidupeta Mandal from October 11 to 20.

As part of the celebrations, the Goddess will appear in different divine alankarams for ten days and bless devotees.

The festivities will commence with Ankurarpanam on October 11.

Goddess Alankarams:

October 11 – Sri Parvati Devi

October 12 – Sri Bala Tripura Sundari

October 13 – Sri Lalita Tripura Sundari

October 14 – Sri Mahalakshmi Devi

October 15 – Sri Annapurna Devi

October 16 – Sri Gayatri Devi

October 17 – Sri Saraswati Devi

October 18 – Sri Durga Devi

October 19 – Sri Mahishasura Mardhini

October 20 – Sri Rajarajeshwari Devi

Every day,

Panchamrita Abhishekam and Asthanam will be performed at 9 a.m., followed by Lalitha Sahasranama Archana, Kumkuma Puja and Panchaharathi in the evening.

TTD appeals to devotees to participate in the Devi Navaratri celebrations in large numbers and seek the divine blessings of Goddess in her various alankarams.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

అక్టోబరు 11 నుంచి 20 వరకు తుమ్మూరు శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు

వివిధ దేవి అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్న అమ్మవారు

తిరుపతి, 2026 అక్టోబరు 05: నాయుడుపేట మండలం తుమ్మూరు గ్రామంలోని శ్రీ కరియమాణిక్యస్వామి, శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 11 నుంచి 20వ తేదీ వరకు దేవి నవరాత్రి ఉత్సవాలను టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించనున్నారు.

దేవీ నవరాత్రుల సందర్భంగా పది రోజులపాటు అమ్మవారు వివిధ దివ్య అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చి, భక్తులపై కరుణాకటాక్షాలు ప్రసరించనున్నారు.

అక్టోబరు 11న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

అమ్మవారి అలంకారాల వివరాలు:

అక్టోబరు 11 – శ్రీ పార్వతీదేవి

అక్టోబరు 12 – శ్రీ బాలా త్రిపురసుందరి

అక్టోబరు 13 – శ్రీ లలితా త్రిపురసుందరి

అక్టోబరు 14 – శ్రీ మహాలక్ష్మీదేవి

అక్టోబరు 15 – శ్రీ అన్నపూర్ణాదేవి

అక్టోబరు 16 – శ్రీ గాయత్రీదేవి

అక్టోబరు 17 – శ్రీ సరస్వతీదేవి

అక్టోబరు 18 – శ్రీ దుర్గాదేవి

అక్టోబరు 19 – శ్రీ మహిషాసురమర్ధిని

అక్టోబరు 20 – శ్రీ రాజరాజేశ్వరీదేవి

ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకం, ఆస్థానం, సాయంత్రం లలితా సహస్రనామార్చన, కుంకుమ పూజ, పంచహారతి నిర్వహించనున్నారు.

దేవీ నవరాత్రులు అమ్మవారి అనుగ్రహాన్ని పొందేందుకు అత్యంత పవిత్రమైన సందర్భమని, ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దివ్య అలంకారాల్లో కొలువుదీరే అమ్మవారిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని, అమ్మవారి కృపాకటాక్షాన్ని పొందాలని టీటీడీ కోరుతోంది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.