ANKURARPANAM FOR HOMA MAHOTSAVAMS _ అక్టోబరు 29 నుంచి నవంబరు 26వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో విశేషపూజ హోమ మహోత్సవాలు

Tirupati, 28 Oct. 19: The ankurarpanam for Homa Mahotsavams will be observed from October 29 till November 26 in Sri Kapileswara Swamy temple at Tirupati.

Every year, during the holy Karthika month, TTD observes this month-long celestial fete in a religious manner in this famous temple dedicated to Lord Shiva.

This fete commences with Ankurarpanam on Tuesday evening. DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupati are supervising the arrangements.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అక్టోబరు 29 నుంచి నవంబరు 26వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో విశేషపూజ హోమ మహోత్సవాలు

తిరుపతి, 2019, అక్టోబరు 28:  పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 29 నుంచి నవంబరు 26వ తేదీ వరకు విశేషపూజ హోమ మహోత్సవాలు జరుగనున్నాయి. అక్టోబరు 29న గ‌ణ‌ప‌తి పూజ‌, అంకురార్పణంతో హోమ  మహోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి.

అక్టోబరు 29 నుంచి 31వ తేదీ వరకు శ్రీ గణపతిస్వామివారి హోమం, న‌వంబరు 1, 2వ తేదీల్లో శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం, న‌వంబరు 2న శ్రీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామివారి కల్యాణోత్సవం, న‌వంబరు 3న  శ్రీ నవగ్రహ హోమం నిర్వహిస్తారు.

అదేవిధంగా, న‌వంబరు 4న  శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం, న‌వంబరు 5 నుంచి 13వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీహోమం), నవంబరు  14 నుంచి 24వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం(రుద్రహోమం), నవంబరు 25న శ్రీ కాలభైరవ స్వామివారి హోమం, నవంబరు 26న శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం, త్రిశూలస్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

కాగా, గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. ఈ హోమాల్లో పాల్గొనే గృహస్తులు సంప్రదాయ వస్త్రధారణలో రావాల్సి ఉంటుంది.

ఈ సందర్భంగా ప్రతిరోజూ టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో హరికథా కాలక్షేపం, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.