అక్టోబరు 4 నుండి 13వ తేదీ వరకు ఆస్థానమండపంలో వేదవిద్వత్‌ సదస్సులు

అక్టోబరు 4 నుండి 13వ తేదీ వరకు ఆస్థానమండపంలో వేదవిద్వత్‌ సదస్సులు

తిరుమల, అక్టోబరు 01, 2013: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తితిదే శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో అక్టోబరు 4 నుండి 13వ తేదీ వరకు తిరుమలలోని ఆస్థానమండపంలో వేదవిద్వత్‌ సదస్సులు జరుగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు ప్రముఖ వేద పండితులు వేద విద్యార్థులను ఉద్దేశించి ఉపన్యసిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు చేపడుతున్నట్టు ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి శ్రీ ఆకెళ్ల విభీషణ శర్మ తెలిపారు.

అక్టోబరు 4వ తేదీన మైసూరుకు చెందిన బ్రహ్మశ్రీ చాగంటి వంశీధర ఘనాపాటి, అక్టోబరు 5న రాజమండ్రికి చెందిన ఆచార్య చిర్రావూరి శ్రీరామశర్మ, అక్టోబరు 6న తిరుపతికి చెందిన ఆచార్య సన్నిధానం సుదర్శనశర్మ, అక్టోబరు 7న చెన్నైకి చెందిన ఆచార్య ఎన్‌ఎస్‌ఆర్‌.రామానుజ తాతాచార్య, అక్టోబరు 8న తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వైస్‌చాన్సలర్‌ ఆచార్య హరేకృష్ణ శతపతి ఉపన్యసిస్తారు.

అలాగే అక్టోబరు 9న మంత్రాలయానికి చెందిన ఆచార్య విఆర్‌.పంచముఖి, అక్టోబరు 10న తిరుపతికి చెందిన ఆచార్య జానుమద్ది రామకృష్ణ, అక్టోబరు 11న హైదరాబాదుకు చెందిన ఆచార్య సముద్రాల రంగరాజరామానుజాచార్య, అక్టోబరు 12న తిరుపతికి చెందిన ఆచార్య కె.ఇ.దేవనాథన్‌, అక్టోబరు 13న గుజరాత్‌కు చెందిన ఆచార్య వెంపటి కుటుంబశాస్త్రి వేదవిజ్ఞానంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.