అక్టోబర్ 2న మహతిలో  ”సత్యహరిశ్చంద్ర” చలన చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌

అక్టోబర్ 2న మహతిలో  ”సత్యహరిశ్చంద్ర” చలన చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌

తిరుపతి, 2010 అక్టోబర్‌ 01 : శ్రీవారికి చిత్రహారతి కార్యక్రమంలో భాగంగా స్థానిక మహతి ఆడిటోరియం నందు అక్టోబర్‌ 2వ తేది శనివారం సాయంత్రం 6.30 గంటలకు ఎన్‌.టి. రామారావు, వరలక్ష్మి, ప్రభాకర్‌రెడ్డి, రేలంగి తదితరులు నటించిన ”సత్యహరిశ్చంద్ర” చలన చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తారు.

కనుక పురప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.