SALE OF PANCHAGAVYA PRODUCTS IN TTD LOCAL TEMPLES- TTD JEO _ అనుబంధ ఆల‌యాల్లో పంచగ‌వ్య ఉత్ప‌త్తుల విక్ర‌యం : టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం

Tirupati, 21 Mar. 22: TTD JEO Sri Veerabrahmam directed officials on Monday to undertake the sale of panchagavya products and dry flower technology products for sale in TTD local temples as well.

 

Speaking at a review meeting in the TTD administrative buildings, the TTD JEO said display boards be kept at all the temples to enhance awareness about the products among devotees. Arrangements be made to display all products like agarbattis etc. and also spread awareness among devotees on these unique products and the significance of all Go-based products from TTD stable.

 

He also suggested to officials to make foolproof arrangements for queue lines, cleanliness security and Anna Prasad am at all local temples in view of growing footfalls.

 

DyEO Smt Parvati, Smt Kasturi Bai, Smt Shanti, SV Goshala director Dr Harnath Reddy, College principal Dr Murali Krishna and others were present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

అనుబంధ ఆల‌యాల్లో పంచగ‌వ్య ఉత్ప‌త్తుల విక్ర‌యం : టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం

తిరుపతి, 2022 మార్చి 21: టిటిడి అనుబంధ ఆల‌యాల్లో అగ‌ర‌బ‌త్తుల‌తో పాటు పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తులు, డ్రైఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జితో త‌యారు చేసిన స్వామివారి ఫొటోలతో పాటు కీ చైన్లు, పేప‌ర్ వెయిట్లు, రాఖీలు, క్యాలెండ‌ర్లు, డ్రై ఫ్ల‌వ‌ర్ మాల‌లు భ‌క్తుల‌కు విక్ర‌యించేందుకు అందుబాటులో ఉంచాల‌ని జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం అధికారుల‌ను ఆదేశించారు. టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నం లోని స‌మావేశ మందిరంలో సోమవారం జెఈవో అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి ఉత్ప‌త్తులపై భ‌క్తుల‌కు మ‌రింత‌ అవ‌గాహ‌న క‌ల్పించేందుకు అన్ని ఆల‌యాల వద్ద స‌మాచార బోర్డులు ఏర్పాటు చేయాల‌న్నారు. అగ‌ర బ‌త్తులు విక్ర‌యించే కౌంట‌ర్ల‌లో పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తులు, డ్రైఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జితో త‌యారు చేసిన స్వామివారి ఫొటోలు కూడా అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేయాలని అధికారుల‌ను ఆదేశించారు. ఆల‌యాల‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తులు, గోవు ప్రాముఖ్య‌త తెలియ‌జేయాల‌న్నారు.

టిటిడి అనుబంధ ఆల‌యాలకు రోజు రోజుకు పెరుగుతున్న భ‌క్తుల ర‌ద్ధీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూలైన్లు, పారిశుద్ధ్యం నిర్వ‌హ‌ణ‌, భ‌ద్ర‌త‌, అన్న‌ప్ర‌సాదాల పంపిణీ త‌దిత‌ర అంశాల‌పై అధికారుల‌తో చ‌ర్చించి ప‌లు సూచ‌న‌లు చేశారు.

డెప్యూటీ ఈవోలు శ్రీ‌మ‌తి పార్వ‌తి, శ్రీ‌మ‌తి క‌స్తూరి బాయి, శ్రీ‌మ‌తి శాంతి, ఎస్వీ గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీ కృష్ణ, ఇత‌ర అధికారులు స‌మావేశంలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.