PAVITROTSAVAMS COMMENCES IN APPALAYAGUNTA _ అప్ప‌లాయ‌గుంటలో శాస్త్రోక్తంగా ప‌విత్రోత్స‌వాలు ప్రారంభం

TIRUPATI, 21 SEPTEMBER 2022:  The annual Pavitrotsavams in Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta commenced on a grand religious note on Wednesday.

 

Earlier in the morning, Pavitra Pratishta was performed followed by Snapana Tirumanjanam was rendered to the utsava murthies of Sri Prasanna Venkateswara, Sridevi and Bhudevi.

 

In the evening Yaga Shala activities will be performed by the temple priests.

 

AEO Sri Prabhakar Reddy, Superintendent Smt Srivani, Temple Inspector Sri Venkata Siva were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అప్ప‌లాయ‌గుంటలో శాస్త్రోక్తంగా ప‌విత్రోత్స‌వాలు ప్రారంభం

తిరుప‌తి, 2022 సెప్టెంబరు 21: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధ‌వారం పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన చేప‌ట్టారు. ఆ త‌రువాత‌ యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ట శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంత‌రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసస్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుక‌గా జరిగింది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్నారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీమ‌తి శ్రీ‌వాణి, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ శ్రీ వెంక‌ట‌శివ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.