ANKURARPANAM HELD _ అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌ 

TIRUPATI, 30 MAY 2023: The Ankurarpanam ritual for annual brahmotsavam in Appalayagunta was observed on Tuesday evening prior to Dhwajarohanam on Wednesday in the auspicious Mithuna Lagnam between 7am and 7:30am.

This religious event was observed from 6pm onwards. As a part Senadhipathi Utsavam was held followed by Mritsangrahanam and Ankurarpanam.

DyEO Sri Govindarajan, AEO Sri Prabhakar Reddy, Superintendent Smt Srivani and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌

తిరుపతి, 2023 మే 30: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్ర‌హ్మోత్స‌వాల‌కు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది. సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ముందుగా మేదినిపూజ చేప‌ట్టారు. ఆ త‌రువాత సేనాధిపతి ఉత్సవం నిర్వ‌హించారు. ఈ ఉత్స‌వం ద్వారా శ్రీ విష్వ‌క్సేనుల‌వారు నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తార‌ని ప్ర‌తీతి. ఆ త‌రువాత యాగ‌శాల‌లో అంకురార్పణ నిర్వహించారు.

మే 31న ధ్వజారోహణం :

మే 31వ తేదీ ఉదయం 7 నుంచి 7.30 గంటల మ‌ధ్య మిథున ల‌గ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఏఈవో  శ్రీ ప్రభాకర్ రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ‌మ‌తి శ్రీ‌వాణి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ శివ‌కుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.