BALALAYA BEGINS AT ALIPIRI PADALA MANDAPAM _ అలిపిరి పాదాల‌మండ‌పంలో బాలాల‌యం కార్య‌క్ర‌మాలు ప్రారంభం

Tirupati, 24 February 2020: The three day rituals of Holy Balalaya commenced at the temple complex of Alipiri Padala mandapam on Monday morning at 10.59 am on Mesha lagnam with the Kumbha a vahana of Balalaya portraits.

The Padala mandapam complex at Alipiri hosted Sri Lakshmi Narayana temple, Sri Andal Ammavari temple, Sri Perialwar temple and Sri Bhaktanjaneya temple s as the gateway to walkers toot path.

14 rutwiks are performing Balalaya rituals in eight hi a Kundalie akalmasha homa, laghu Purnahuti in the morning of Monday and Punya havachanam with Agni pratista and kalakrshan and kumbharadhana homam in the evening. TTDs Agama advisor NK Sundara Varadan, Sri Murali Krishna chief archaka of Padala mandapam temples are supervising the arrangements.

On February 25th Tuesday morning Agni pranayanam, kumbharadhana for portraits, akalmasha homa, laghu Purnahuti will be performed and Maha Shanti Purnahuti, and mahashanti prokshana were performed in the evening.

On February 26th on the Phalguna Sudha tadhiya Mesha lagnam after Punya havachanam kumbha aavahana was conducted in the morning and temples thrown open for sarva darshan commenced.

Spl Gr DyEO of Sri Govindaraja Swamy Temple Smt Varalakshmi, AEO Sri Ravi Kumar Reddy, Temple inspector Sri Srinivasulu and others participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI     

 

 

 

అలిపిరి పాదాల‌మండ‌పంలో బాలాల‌యం కార్య‌క్ర‌మాలు ప్రారంభం

 ఫిబ్రవరి 24, తిరుపతి, 2020: తిరుప‌తిలోని అలిపిరి వ‌ద్ద‌గ‌ల శ్రీ‌వారి పాదాల మండ‌పంలోని ఆల‌యాల బాలాల‌యం ప‌నులు సోమ‌వారం ప్రారంభ‌మ‌య్యాయి. మూడు రోజుల పాటు ఈ కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి. ఫిబ్ర‌వ‌రి 26న ఉద‌యం 10.27 నుండి 10.59 గంట‌ల న‌డుమ మేష ల‌గ్నంలో బాలాల‌య చిత్ర‌ప‌టాల‌కు కుంభ ఆవాహ‌న నిర్వ‌హిస్తారు.

పాదాల మండ‌పంలో శ్రీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ స్వామివారి ఆల‌యం, శ్రీ ఆండాళ్ అమ్మ‌వారి ఆల‌యం, శ్రీ పెరియాళ్వార్ ఆల‌యం, శ్రీ భ‌క్తాంజ‌నేయ‌స్వామివారి ఆల‌యాలు ఉన్నాయి. 8 హోమ‌గుండాల్లో 14 మంది ఋత్వికులు బాలాల‌యం వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. టిటిడి వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ ఎన్ఎకె.సుంద‌ర‌వ‌ర‌ద‌న్‌, పాదాల మండం ఆల‌యాల ప్ర‌ధానార్చ‌కులు శ్రీ ముర‌ళీకృష్ణ ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

బాలాల‌యంలో భాగంగా సోమ‌వారం ఉద‌యం యాగ‌శాల‌లో అక‌ల్మ‌ష హోమం, ల‌ఘుపూర్ణాహుతి చేప‌ట్టారు. సాయంత్రం పుణ్యాహ‌వ‌చ‌నంలో అగ్నిప్ర‌తిష్ట‌, క‌ళాక‌ర్ష‌ణ‌, కుంభారాధ‌న ఉక్త హోమాలు నిర్వ‌హించారు.

ఫిబ్ర‌వ‌రి 25న ఉద‌యం అగ్నిప్ర‌ణ‌య‌ణం, చిత్ర‌ప‌టాల‌కు కుంభారాధ‌న‌, అక‌ల్మ‌ష‌హోమం, ల‌ఘుపూర్ణాహుతి, సాయంత్రం మ‌హాశాంతి పూర్ణాహుతి, బాలాల‌య చిత్ర‌ప‌టాల‌కు మ‌హాశాంతిప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు. ఫిబ్ర‌వ‌రి 26న ఉద‌యం 7.30 గంట‌లకు పుణ్యాహ‌వ‌చ‌నం, ఉద‌యం 10.27 నుండి 10.59 గంట‌ల న‌డుమ ఫాల్గుణ శుద్ధ త‌దియ మేష ల‌గ్నంలో బాలాల‌య చిత్ర‌ప‌టాల‌కు కుంభ ఆవాహ‌న చేప‌డ‌తారు. మ‌ధ్యాహ్నం 11.30 గంట‌ల నుండి భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీ, ఏఈఓ శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.