KALYANA VENKANNA GRACES ON ASWA _ అశ్వ వాహనంపై పార్వేట రాజు అలంకారంలో శ్రీ కల్యాణ వెంకన్న

Tirupati, 9 Mar. 21: Sri Kalyana Venkateswara Utsava Murthy shined on Aswa Vahana on Tuesday evening.

Temple DyEO Smt Shanti and others took part in this vahana seva that was observed in Ekantam due to Covid guidelines.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అశ్వ వాహనంపై పార్వేట రాజు అలంకారంలో శ్రీ కల్యాణ వెంకన్న

తిరుపతి, 2021 మార్చి 09: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం రాత్రి స్వామివారు పార్వేట రాజు అలంకారంలో అశ్వ‌వాహనంపై అనుగ్ర‌హించారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వస్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వ వాహనాధిరూఢుడై తన స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండమని నామసంకీర్తనాద్యుపాయాలను ఆశ్రయించి తరించమని ప్రబోధిస్తున్నాడు.

మార్చి 10వ తేదీ బుధవారం ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌రకు చ‌క్ర‌స్నానం, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌రకు ధ్వ‌జావ‌రోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ముగియ‌నున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యుడు, సూపరింటెండెంట్లు శ్రీ చెంగల్రాయలు, శ్రీ రమణయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.