RELAUNCH OF AKHANDA  HARINAMA SANKEERTANA PROGRAM IN TIRUMALA FROM AUGUST 1 _ ఆగ‌స్టు 1 నుండి తిరుమ‌ల‌లో అఖండ హ‌రినామ సంకీర్త‌న‌

Tirumala,24 July 2022: As part of its Hindu Sanatana Dharma promotion activity, TTD is all set to relaunch the Akhanda Harinama Sankeertana from  August 1 in Tirumala.

The program in which folk artists from several regions come to Tirumala and perform sankeertanas of Annamaiah, Ramadas, Thyagaraja, and other stalwarts in their own style on a platform adjacent to the main Kalyana Katta. But it was stopped during the covid season for over two years.

TTD provides the artist’s accommodation, boarding, and Srivari darshan and transport cost is directly credited to their bank accounts.

To facilitate the program TTD allotted time and day slots to the bhajan teams and details are uploaded on the TTD website-www.tirumala.org

As the activity is set to resume from August 1 onwards, TTD had uploaded the allocations of time and day slots for the month of August on its website already. The folk bhajan teams are provided an opportunity not only at Tirumala but also in festivities of all TTD temples in the districts across the State as well.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUMALA

ఆగ‌స్టు 1 నుండి తిరుమ‌ల‌లో అఖండ హ‌రినామ సంకీర్త‌న‌

తిరుమల, 2022 జులై 24: హిందూ ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా జాన‌ప‌ద క‌ళ‌ల‌ను ప‌రిర‌క్షించి అవి అంత‌రించిపోకుండా కాపాడేందుకు టిటిడి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా కరోనా కారణంగా తిరుమలలో కొంత కాలం పాటు నిలిచిపోయిన అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని ఆగస్టు 1వ తేదీ నుండి తిరిగి ప్రారంభించ‌నుంది. వివిధ ప్రాంతాల నుండి జానపద కళాకారులు తిరుమ‌ల‌కు విచ్చేసి అన్నమయ్య, త్యాగయ్య తదితర వాగ్గేయకారుల భజనలు, కీర్తనలు ఆలపిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనే భ‌జ‌న బృందాల స‌భ్యుల‌కు వ‌స‌తి, భోజ‌నం, ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. రాను పోను బ‌స్సు ఛార్జీల‌కు అయ్యే రుసుమును వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జ‌మ చేస్తారు. భ‌జ‌న బృందాల స‌భ్యుల‌కు నిర్దేశిత స్లాట్ కేటాయించి వారి వివ‌రాల‌ను టిటిడి వెబ్‌సైట్ www.tirumala.org లో అందుబాటులో ఉంచుతారు. ఆగ‌స్టు నెల‌కు సంబంధించి కేటాయించిన స్లాట్ల వివ‌రాల‌ను ఇప్ప‌టికే వెబ్‌సైట్‌లో పొందుప‌రిచారు. తిరుమ‌ల‌తోపాటు వివిధ జిల్లాల్లోని టిటిడి ఆల‌యాల్లో జ‌రిగే ఉత్స‌వాల్లో ప్ర‌ద‌ర్శ‌న‌కు భ‌జ‌న బృందాల స‌భ్యుల‌కు అవ‌కాశం క‌ల్పిస్తారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.