MAKE SUDDHA TIRUMALA-SUNDARA TIRUMALA ON AUGUST 12 A GRAND SUCCESS- TTD JEO (H&E)_ ఆగస్టు 12న “శుద్ధ తిరుమల – సుందర తిరుమల”ను విజయవంతం చేయాలి- టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి

Tirupati, 10 August 2023: TTD JEO(Health & Education) Smt Sada Bhargavi on Thursday directed officials of all departments to make coordinated efforts towards the grand success of Suddha Tirumala- Sundara Tirumala scheduled on August 12  on ghat roads and footpaths of Tirumala. 

 

Addressing a review meeting at Sri Padmavati Rest House in Tirupati on Thursday evening the JEO said that all 750 students of TTD educational institutions will participate. With 30 members each in the 25 sectors, the teams would consist of a health worker, engineering mazdoor, security guard from Vigilance and a sectorial officer besides students of NSS and NCC. 

 

Students will be drawn from SV Arts College, Sri Govindarajaswamy College, SPW College, SV Oriental College, SV Junior College. She said the cleaning program will commence at 5.30 am.

 

She reviewed the arrangements with transport, sanitary materials, catering, First aids kits, garbage clearance, ropes and wireless sets. 

 

DEO Sri Bhaskar Reddy,, DyEOs Sri Govindarajan, Sri Subramanyam, health officer Dr Sridevi, Additional HO Dr Sunil Kumar, EEs Sri Manoharam, Sri Surendranath, and principals of respective colleges were present. 

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టు 12న “శుద్ధ తిరుమల – సుందర తిరుమల”ను విజయవంతం చేయాలి

– టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుపతి, 2023 ఆగస్టు 10: టీటీడీ ఆధ్వర్యంలో రెండో విడతగా తిరుమల-తిరుపతి రెండు ఘాట్ రోడ్లు, నడకదారుల్లో ఆగస్టు 12వ తేదీ జరగనున్న శుద్ధ తిరుమల – సుందర తిరుమల కార్యక్రమాన్ని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో గురువారం సాయంత్రం ఈ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో టీటీడీ విద్యాసంస్థల నుంచి 750 మంది విద్యార్థులు పాల్గొంటారని, ఒక్కో సెక్టార్లో 30 మంది చొప్పున 25 సెక్టార్లుగా విభజించామని చెప్పారు. ఒక్కో సెక్టార్ లో ఎన్ఎస్ఎస్, ఎన్.సి.సి, ఇతర విద్యార్థులతోపాటు హెల్త్ వర్కర్, ఇంజినీరింగ్ మజ్దూరు, విజిలెన్స్ సెక్యూరిటీ గార్డ్, సెక్టోరియల్ ఆఫీసర్ ఉంటారని, సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల, ఎస్వీ ఓరియంటల్ కళాశాల, ఎస్వీ జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొంటారని, ఉదయం 5.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని వివరించారు. ఇందుకు సంబంధించి రవాణ, శానిటరీ మెటీరియల్, క్యాటరింగ్, ప్రథమ చికిత్స కిట్లు, చెత్త సేకరణ, రోప్ లు, వైర్ లెస్ సెట్లు తదితర అంశాలపై జెఈవో సమీక్షించారు. సెక్టోరియల్ ఆఫీసర్లు పాటించాల్సిన విధివిధానాలపై తగిన సూచనలు చేశారు.

ఈ సమీక్షలో డీఈఓ శ్రీ భాస్కర్ రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ గోవిందరాజన్, శ్రీ సుబ్రహ్మణ్యం, డి ఎఫ్ఓ శ్రీనివాస్ ,హేల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, అదనపు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్, ఈఈలు శ్రీ మనోహర్, శ్రీ సురేంద్రనాథ్ రెడ్డి, ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.