GOPUJA MAHOTSAVAM AT SV GOSHALA _ ఎస్వీ గోశాలలో  ఘనంగా గోపూజ మహోత్సవం

Tirupati,16 January 2023:  As part of Kanuma festivities, TTD on Monday organised a grand Gopuja Mahotsavam at Sri Venkateswara Go SamrakshanaShala at Tirupati.

The festivities included Venuganam, Veda parayanams by students of SV Veda Pathashala, Bhajans by artists of the Dasa Sahitya project, Kolatas by HDPP artists and finally Sankeertans by artists of the Annamacharya project.

Among others, TTD also organised rituals like Gopuj,  special Puja to Sri Venugopal Swami, Tulasi puja, Gobbemma fete, Gaja puja, Aswa puja,vrushabha puja etc.

Thereafter Sri Venugopal swami Darshan, Anna Prasadam were held and prizes distributed for artists of cultural programs.

TTD EO Sri AV Dharma Reddy, JEO Smt Sada Bhargavi, Goshala Director Dr Harinath Reddy, TTD Gosamrakshana Trust Board member Sri Ram Sunil Reddy were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ గోశాలలో  ఘనంగా గోపూజ మహోత్సవం
 
తిరుపతి 16 జనవరి 2023:  తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో కనుమ పండుగ సందర్భంగా సోమవారం గోపూజ మహోత్సవాన్ని  ఘనంగా నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుండి వేణుగానం, 8 నుండి 9 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల విద్యార్థులు వేద పారాయణం జరిపారు. ఉదయం 8 నుండి 10.30 గంటల వరకు  దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజన, కోలాటాలు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంకీర్తన  కార్యక్రమాలు  నిర్వహించారు.
 
ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, వేణుగోపాలస్వామి హారతి, తులసి పూజ, గొబ్బెమ్మ వేడుక, గజపూజ, అశ్వపూజ, వృషభ పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆతరువాత భక్తులకు శ్రీవేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేశారు . సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులకు అథితులు బహుమతులు పంపిణీ చేశారు. 
 
టీటీడీ ఈవో  శ్రీ ధర్మారెడ్డి, జేఈవో  శ్రీమతి సదా భార్గవి, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి, టీటీడీ గో సంరక్షణ ట్రస్టు సభ్యులు  శ్రీ రామ్ సునీల్ రెడ్డి  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.