JEO INSPECTS SV POOR HOME AND KARUNADHAM _ ఎస్వీ పూర్ హోమ్, కరుణాధామాన్ని పరిశీలించిన జేఈఓ శ్రీమతి సదా భార్గవి

Tirupati, 6 Mar. 21: TTD JEO Smt Sada Bhargavi on Saturday inspected the SV Poor Home for the homeless and Karunadham, the shelter for Leprosy patients, run by the TTD and made some valuable suggestions on services and facilities for inmates.

After interacting with inmates she directed officials to provide quality of food and medical services to inmates.

The JEO directed officials to provide quality food and take up extensive repairs in the buildings. 

She also asked officials to clear the overgrowth of shrubs in both premises and to grow vegetables on vacant land.

  CMO Dr Narmada, DFO Sri Chandrasekhar and Dr Bharat Kumar were present in the inspection tour of JEO.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ పూర్ హోమ్, కరుణాధామాన్ని పరిశీలించిన జేఈఓ శ్రీమతి సదా భార్గవి


తిరుపతి, 2021 మార్చి 06: టిటిడి తిరుపతిలో నిరాశ్రయులైన వృద్ధుల కోసం నిర్వహిస్తున్న ఎస్వీ పూర్ హోమ్ ను‌‌, కుష్టువ్యాధిగ్రస్తుల కోసం నిర్వహిస్తున్న కరుణాధామాన్ని జెఈఓ శ్రీమతి సదా భార్గవి శనివారం పరిశీలించారు. టీటీడీ అందిస్తున్న వైద్య సేవలను, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ ఈ రెండు ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న సామగ్రిని వెంటనే తొలగించాలన్నారు. ప్రార్థనా మందిరం, వార్డుల బయట గోవిందనామాలు వినిపించాలని సూచించారు. ప్రస్తుత వాతావరణంలో త్వరగా పాడయ్యే వంట సరుకులను గుర్తించి వాటిని తగిన విధంగా భద్రపరచాలన్నారు. అనంతరం టిటిడి అందిస్తున్న భోజనం నాణ్యత, వైద్యులు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలను వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. మరింత నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు సూచించారు. గదుల్లో బెడ్ షీట్లను క్రమం తప్పకుండా మార్చాలన్నారు. ఎస్వీ పూర్ హోమ్ లో పొదలను తొలగించి ఖాళీ ప్రదేశంలో కూరగాయల మొక్కలను పెంచాలన్నారు. అవసరమైన చోట్ల వెంటనే మరమ్మతులు చేపట్టి బాగు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.

జెఈఓ వెంట సిఎంఓ డాక్టర్ నర్మద, డిఎఫ్ఓ శ్రీ చంద్రశేఖర్, వైద్యుడు డాక్టర్ భరత్ కుమార్ తదితరులు ఉన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.