TIME EXTENDED _ ఎస్వీ శిల్ప కళాశాలలో సాయంత్రం కోర్సులకు దరఖాస్తు గ‌డువు పెంపు

Tirupati, 3 January 2023: TTD has extended the last date for admission to evening courses in SV Traditional Sculpture Institute for the academic year 2023-24 upto January 20.

 

TTD has introduced a one-year evening certificate course on Basics in Sculpture and Traditional Kalamkari Arts at the institute.

 

Applications are available at the Institution and should be submitted before the evening of January 20. The Candidates with 10th-class pass and no age limit could apply.

 

For more details contact the Principal, SV Traditional Temple Sculpture Training Institute,VAlipiri Road, near Balaji Link bus stand, Tirupati or dial

0877-2264637, and mobile 9866997290 

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ శిల్ప కళాశాలలో సాయంత్రం కోర్సులకు దరఖాస్తు గ‌డువు పెంపు

తిరుప‌తి, 2024 జ‌న‌వ‌రి 03: శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో 2023-24 విద్యాసంవత్సరానికి గాను సాయంత్రం కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తు గ‌డువు జ‌న‌వ‌రి 20వ తేదీ వ‌ర‌కు పెంచ‌డ‌మైన‌ది.

ఏడాది కాలం శిక్షణ కలిగిన సర్టిఫికేట్ కోర్సులైన‌ “సంప్రదాయ కళంకారి కళ” మరియు “శిల్పకళలలో ప్రాథమిక అంశాలు (Basics in Sculpture)” అనే కోర్సులు నూతనంగా ప్రవేశ పెట్టారు.

క‌ళాశాల‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. పూర్తి చేసిన దరఖాస్తులను జ‌న‌వ‌రి 20వ తేదీ సాయంత్రంలోపు కళాశాలలో సమర్పించాల్సి ఉంటుంది. కోర్సులో ప్ర‌వేశం పొందేందుకు 10 వ తరగతి పాసై ఉండాలి. వీరికి గరిష్ట వయో పరిమితి లేదు.

ఇతర వివరాల కోసం ప్రిన్సిపాల్, ఎస్వీ సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ కళాశాల, అలిపిరి రోడ్, బాలాజీ లింక్ బస్టాండ్ ప‌క్కన, తిరుపతిలో గానీ, 0877-2264637, మొబైల్ నెం.9866997290 నంబ‌ర్ల‌ను గానీ సంప్రదించగలరు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.