GRAND SRI BHADRACHALA RAMADASU JAYANTI AT SV COLLEGE OF MUSIC AND DANCE _ ఎస్వీ సంగీత క‌ళాశాల‌లో ఘ‌నంగా శ్రీ భ‌ద్రాచ‌ల రామ‌దాసు జ‌యంతి

Tirupati, 04 February 2022:  Sri Bhadrachala Ramadasu Jayanti was grandly celebrated at Sri Venkateswara College of Music and Dance on Friday wherein the teachers and students together chanted the sankeertans of Sri Ramadasu and Ramanamavali.

 

Earlier they performed puja to the statue of Sri Ramadasu in the college corridor and also presented floral tributes. Thereafter the students and teachers rendered Ramanamavali.

 

Later they also performed special pujas to the idols of Sitarama statues. The pundits narrated the significance of Sri Ramadasu life and glory to students.

 

SV College of Music and Dance Principal Sri Sudhakar led the fete in which students and staff members participated.

 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఎస్వీ సంగీత క‌ళాశాల‌లో ఘ‌నంగా శ్రీ భ‌ద్రాచ‌ల రామ‌దాసు జ‌యంతి

తిరుప‌తి, 2022 ఫిబ్ర‌వ‌రి 04: తిరుపతిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర సంగీత, నృత్య క‌ళాశాల‌లో శ్రీ భ‌ద్రాచ‌ల రామ‌దాసు జ‌యంతిని శుక్ర‌వారం ఘనంగా నిర్వహించారు. అధ్యాప‌కులు, విద్యార్థులు క‌లిసి శ్రీ‌రామ‌దాసు కీర్త‌న‌ల‌ బృంద‌గానం, రామ‌నామావ‌ళిని ఆలపించారు.

ఈ సందర్భంగా ఉదయం కళాశాల ప్రాంగణంలోని శ్రీ భ‌ద్రాచ‌ల రామ‌దాసు విగ్ర‌హానికి పూజ‌, పుష్పాంజ‌లి ఘటించారు. ఆ తరువాత రామదాసు విగ్రహం ఎదుట అధ్యాప‌కులు, విద్యార్థులు క‌లిసి శ్రీ‌రామ‌దాసు రామ‌నామావ‌ళిని గానం చేశారు. కళాశాలలోని సీతా లక్ష్మణ శ్రీరాముని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారాముల విగ్రహం ఎదుట అధ్యాప‌కులు, విద్యార్థులు క‌లిసి రామదాసు రచించిన పలుకే బంగారమాయెనా… త‌దిత‌ర కీర్తనలను బృంద‌గానం చేశారు. ఈ సంద‌ర్భంగా రామ‌దాసు జీవిత విశేషాల‌ను పండితులు విద్యార్థులకు తెలియజేశారు.

ఎస్వీ సంగీత, నృత్య‌ క‌ళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ఎం.సుధాక‌ర్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో అధ్యాప‌కులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.