PURANDHARA DASA ARADHANA MAHOTSAVAM OBSERVED IN TTD MUSIC AND DANCE COLLEGE _ ఎస్.వి సంగీత నృత్య కళాశాలలో ఘనంగా శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు

TIRUPATI, 21 JANUARY 2023: The Aradhana Mahotsavams of Kannada Saint Poet Sri Purandhara Dasa was observed in Sri Venkateswara College of Music and Dance along with the Nadaswaram College of TTD in Tirupati in the college premises on Saturday with the spiritual fervour touching the sky.

After offering prayers to the Kannada Pada Kavita Pitamaha, the faculty and students rendered the Dasa Padagalu on the occasion which included some famous notes like Gajavadana Beduve, Venkatachala Nilayam, Tamburimeetidava etc. 

The College Principal Sri Sudhakar, other faculty, students were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్.వి సంగీత నృత్య కళాశాలలో ఘనంగా శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు

తిరుపతి, 2023 జనవరి 21: తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు శనివారం ఘ‌నంగా జరిగాయి.

ఈ సంద‌ర్భంగా ఉదయం 9 గంటలకు కళాశాల ప్రాంగణం లోని శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ పురందరదాసుల వారి విగ్రహాలకు పూజలు నిర్వహించారు అనంతరం స్థానిక కళాకారులు, అధ్యాపకులు, విద్యార్థులు బృందగానం నిర్వహించారు. ఇందులో “గజవదన బేడువే ….., వెంకటాచల నిలయం…, తాంబూరి మీటిదవ…. తదితర శ్రీ పురంద‌రదాస కీర్త‌న‌ల‌ను చ‌క్క‌గా ఆల‌పించారు. అనంతరం ఎస్వీ నాదస్వరం పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు నాదస్వరం, డోలు వాద్య సంగీతం నిర్వహించారు.

అలిపిరి వద్ద పుష్పాంజ‌లి :

ఆరాధ‌నోత్స‌వాల్లో భాగంగా శనివారం ఉదయం 6 గంటలకు అలిపిరి వ‌ద్ద‌గ‌ల శ్రీ పురందరదాసుల విగ్రహానికి దాసు సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి శ్రీ ఆనంద తీర్థ చార్యులు పుష్పమాల సమర్పించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీ సుధాకర్, అన్ని విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.