VONTIMITTA ANKURARPANAM ON APRIL 16 _ ఏప్రిల్ 16న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్పణ

VONTIMITTA, 15 APRIL 2024: The annual Sri Rama Navami Brahmotsavam in Vontimitta will commence from April 17 onwards with Ankurarpanam on April 16 in famous temple of Sri Kodanda Ramalayam.

All Dharmika Projects of TTD will organize Kavi Sammelanam on April 17 and 18 in connection with Bammera Potana Jayanti.

The annual Brahmotsavams flag off with Dhwajarohanam on April 17 between 10:30am and 11am.

TTD will be organising special cultural programmes till April 25.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఏప్రిల్ 16న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్పణ

– ఏప్రిల్ 17, 18వ తేదీల్లో కవి సమ్మేళనం

తిరుపతి, 2024 ఏప్రిల్ 15: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్ర‌హ్మోత్స‌వాలు ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వరకు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి. ఏప్రిల్ 16న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వ‌హించ‌నున్నారు.

కవి సమ్మేళనం :

శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినం, శ్రీ పోతన జయంతిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఏప్రిల్ 17, 18వ తేదీల్లో మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు కవి సమ్మేళనం నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏప్రిల్ 17వ తేదీ ప్రముఖ పండితులు శ్రీ శంకర్ – భాగవతం ప్రాశస్త్యం, శ్రీ ఎం.నారాయణ రెడ్డి – గజేంద్రుని ఆక్రందన, డా. సుమన – మందోదరి హితబోధ, శ్రీ గోపాలకృష్ణ శాస్త్రి – సీతా స్వయంవరం, శ్రీ శివ శంకర్ – రుక్మిణి సందేశం, శ్రీ శివారెడ్డి –ఒంటిమిట్ట రామాలయం ప్రాశస్త్యం అంశాలపై కవి సమ్మేళనం జరుగుతుంది.

అదేవిధంగా ఏప్రిల్ 18వ తేదీ శ్రీ రాంప్రసాద్ రెడ్డి – ఒంటిమిట్ట రామాలయం ప్రాశస్త్యం, శ్రీ వెంకటరమణ – హనుమత్ సందేశం, శ్రీమతి నీలవేణి – రంతి దేవుని చరిత్ర, శ్రీ వెంకటేశ్వర ఆచారి- శ్రీ రామ లక్ష్మణుల సోదర ప్రేమ, శ్రీ మధుసూదన్ – శ్రీకృష్ణ లీల, శ్రీ మల్లికార్జున రెడ్డి – జానకి సందేశం, శ్రీ నరసింహులు – రామరాజ్యం శ్రీ జగన్నాథ్ – సుందరకాండ అంశాలపై కవి సమ్మేళనం నిర్వహిస్తారు.

శ్రీ కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 10 నుండి రాత్రి 9 గంటల వరకు ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.