THUMBURU THIRTHA MUKKOTI FETE ON APRIL 6 _ ఏప్రిల్ 6న తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి 

Tirumala, March 16, 2023: TTD is organising the Sri Thumburu Thirtha Mukkoti fete located 7-1/2 miles away from Sri Venkateshwara temple on April 6  on Uttara phalguni nakshatra on Pournami day during Phalguna month.

 Legends say that seven of the countless holy springs at seshachala forest range around Srivari temple brought a multitude of punya including Mukti to devotees. They are Swami Pushkarini, Kumaradhara, Thumburu thirtha , Ramakrishna thirtha, Akashaganga, Papavinasham and Pandava thirtha.

On this auspicious day, a holy dip in the sacred springs located in a picturesque hill range is all set to earn huge dharmic dividends to devotees.

TTD is making all arrangements for devotees benefit along with Archakas special pujas and others on the sacred occasion.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 6న తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి

తిరుమల, 2023 మార్చి 16: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఏడున్నర మైళ్ల దూరంలో వెలసివున్న శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం ఏప్రిల్ 6న జరుగనుంది.

పురాణప్రాశస్త్యం ప్రకారం తిరుమలలోని శేషగిరులలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయని ప్రతీతి. ఈ తీర్థాలలో ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తిప్రదాలు కలిగించేవి 7 తీర్థాలు. అవి స్వామివారి పుష్కరిణి, కుమారధార, తుంబురు, రామకృష్ణ, ఆకాశగంగ, పాపవినాశనం మరియు పాండవ తీర్థాలు. ఈ తీర్థాలలో ఆయా పుణ్యఘడియల్లో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగి ముక్తి సమకూరుతుందని పురాణ వైశిష్ట్యం.

ఫాల్గుణ మాసంలో ఉత్తరఫల్గుణీ నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు తుంబురు తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈ పర్వదినాన తీర్థస్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. ఈ ముక్కోటిలో టిటిడి అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.