ATTRACTIVE CULTURAL PROGRAMS AT VONTIMITTA SRI RAMANAVAMI BUTs _ ఒంటిమిట్ట శ్రీ‌రామ‌న‌వ‌మి బ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు

Tirupati, 08 April 2022: TTD is organising an attractive literary, dharmic and cultural programs at the annual Sri Ramanavami Brahmotsavams at Vontimetta Sri Kodandarama Swamy temple from April 10-18.

The day begins with dharmic discourses in the morning followed by Bhakti sangeet in Unjal Seva at the evening and harikathas in the night besides bhajan and Kolata teams during vahana sevas.

TTD is conducting a Kavi Sammelan as part of the Kavi Bammera Pothana Jayanti on April 10 and a Sahitya sadassu on April 11 in connection with the Sri Rama Pattabhisekam.

APRIL 15 FESTIVITIES

TTD is organising various cultural programs on the occasion of Sri Sitarama Kalyanotsavam which includes Nadaswara Vaidyam by SV College of Music and Dance, artists of SVBC ‘Adivo – Alladivo’ program, Nama sankeetans by Sri Vitthal Das Maharaj of Tamilnadu and special discourses by Acharya Chakravarti Ranganathan of National Sanskrit University, Dr Akella Vibhishana Sharma, Director of Annamacharya Project.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఒంటిమిట్ట శ్రీ‌రామ‌న‌వ‌మి బ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు

తిరుపతి, 2022 ఏప్రిల్ 08: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 10 నుండి 18వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆకట్టుకునేలా ధార్మిక, సంగీత, సాహిత్య కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ఆలయం వద్ద ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ధార్మికోపన్యాసం, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఊంజల్‌సేవలో భక్తి సంగీతం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు హరికథ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం, రాత్రి వాహనసేవల్లో కళాబృందాల సభ్యులు ః భజనలు, కోలాటాలు తదితర కళారూపాలను ప్రదర్శిస్తారు.

క‌వి స‌మ్మేళ‌నం, సాహితీ స‌ద‌స్సు…

ఏప్రిల్ 10న బమ్మెర పోతన జయంతి సందర్భంగా ఆలయం వద్ద మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు కవి సమ్మేళనం నిర్వహిస్తారు. ఏప్రిల్ 11న శ్రీ‌రామ‌ప‌ట్టాభిషేకం సంద‌ర్భంగా మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు సాహితీ స‌ద‌స్సు జ‌రుగ‌నుంది.

ఏప్రిల్ 15న కల్యాణోత్సవం రోజున ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు…

ఏప్రిల్ 15న కల్యాణోత్సవం సందర్భంగా కల్యాణ వేదిక వద్ద సాయంత్రం 4 నుండి 4.30 గంట‌ల వర‌కు ఎస్వీ సంగీత, నృత్య క‌ళాశాల ఆధ్వ‌ర్యంలో నాద‌స్వ‌ర వాద్యం, సాయంత్రం 4.30 నుండి 5 గంట‌ల వ‌ర‌కు ఎస్వీబీసీ అదివో అల్ల‌దివో కార్య‌క్ర‌మం క‌ళాకారుల‌తో భ‌క్తిసంగీతం, సాయంత్రం 5 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు ఎస్వీ సంగీత, నృత్య క‌ళాశాల అధ్యాప‌కుల‌తో నామ‌సంకీర్త‌నం, సాయంత్రం 5.30 నుండి 6.15 గంటల వ‌ర‌కు ఎదుర్కోలు, సాయంత్రం 6.15 నుండి 7.45 గంట‌ల వ‌ర‌కు త‌మిళ‌నాడుకు చెందిన శ్రీ విఠ‌ల్‌దాస్ మ‌హ‌రాజ్ బృందం నామ‌సంకీర్త‌నం కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. తిరుప‌తిలోని జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఆచార్యులు ఆచార్య చ‌క్ర‌వ‌ర్తి రంగ‌నాథ‌న్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ కల్యాణోత్సవానికి ప్ర‌త్యేకంగా వ్యాఖ్యానం చేస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.