‌MUSICAL NIGHT IN SRI KT _ కపిలతీర్థంలో వీనుల‌విందుగా సంకీర్త‌నాలాప‌న‌

Tirupati, 04 March 2024: The music and dance programs organized by Sri Venkateswara College of Music and Dance and Sri Venkateswara Nadaswara and Dolu School of TTD on the fourth day of the annual Brahmotsavam of Sri Kapileswara Swami on Monday night were impressive.

As part of this, on the stage set up in the premises of the temple, the lecturers and students of the vocal department of the college rendered several Sankeertans with emotion. This was followed by an enchanting dance performance by the Former Principal of the College Dr Prabhavati’s disciples.

In this program, the Principal of the college Dr. Uma Muddubala and others participated.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

కపిలతీర్థంలో వీనుల‌విందుగా సంకీర్త‌నాలాప‌న‌

తిరుప‌తి, 2024, మార్చి 04: శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమ‌వారం రాత్రి శ్రీ వెంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల మరియు శ్రీ వెంకటేశ్వర నాదస్వర, డోలు పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత, నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై కళాశాల గాత్ర విభాగం అధ్యాపకులు శ్రీ సురేష్‌బాబు శిష్య బృందం పలు సంకీర్తనలను భావ‌యుక్తంగా ఆలపించారు. ఈ కార్యక్రమానికి వయోలిన్ పై డా. పూర్ణ వైద్య‌నాథ‌న్‌, మృదంగంపై శ్రీ శంక‌ర్ వాద్య సహకారం అందించారు.

అనంతరం కళాశాల వేణుగాన‌ విభాగాధిప‌తి ఎం.అనంత‌కృష్ణ వేణుగానం స‌భ‌ను ర‌క్తి క‌ట్టించింది. ఆ తరువాత కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ శ్రీమతి ప్రభావతి శిష్యబృందం భరతనాట్య ప్రదర్శన చక్కటి అభినయంతో సాగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. ఉమా ముద్దుబాల తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.