RAJAMANNAR GRACES ON KALPAVRIKSHA  _ కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి

TIRUPATI, 20 JUNE 2024: The annual Brahmotsavam on the fourth day witnessed Sri Prasanna Venkateswara in Rajamanmar Alankaram on the divine Kalpavriksha Vahanam on Thursday.

The carrier fete took place between 8am and 9am and the utsava deities paraded along the mada streets amidst colourful dancing, bhajan troupes.

AEO Sri Ramesh, Superintendent Smt Srivani, Kankanabhattar Sri Suryakumaracharyulu, temple inspector Sri Siva Kumar and devotees were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

తిరుపతి, 2024 జూన్ 20: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీనివాసుడు కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

ఉదయం 8 నుండి 9 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తూ కల్పవృక్షం ఇవ్వలేని ధర్మమోక్షాల్ని కూడా నేను అనుగ్రహిస్తానని నిరూపిస్తున్నారు. కల్పవృక్షాలు లోకాతీతమైన ఏ ఫలాన్నయినా ఇస్తాయి. ఇవి కోరుకునేవారి తెలివిని బట్టి లభిస్తాయి. ఈనాటి వాహనమైన కల్పవృక్షం ఐదు కల్పవృక్షాల ఏకరూపం. అన్ని కల్పవృక్షాలిచ్చే ఫలాలు శ్రీవారే ఇస్తారు. శ్రీదేవి, భూదేవి ఇహలోక ఫలాలిస్తారు. శ్రీవారు దివ్యలోకఫలాలు, ముక్తిని ప్రసాదిస్తారు. కనుక కల్పవృక్ష వాహనోత్సవ సేవ ఇహపరఫల ఆనందదాయకం.

అనంతరం ఉదయం 10 గంటల నుండి స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు.

అనంతరం సాయంత్రం 4:30 నుండి 6:30 గంటల వరకు శ్రీవారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు సర్వభూపాలవాహనంపై శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

వాహన సేవలో ఆలయ ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్‌ శ్రీమతి
శ్రీవాణి, కంకణభట్టార్‌ శ్రీ సూర్యకుమార్‌ ఆచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శివకుమార్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.