DEVOTEES THRILLED BY CULTURAL TEAMS OF AT SRI PAT BTU _ కల్పవృక్ష వాహన‌సేవ‌లో ఆక‌ట్టుకున్నఇత‌ర రాష్ట్రాల కళాబృందాలు

Tiruchanoor, 26 Nov. 19: On the fourth day of the ongoing  Karthika brahmotsavams of Sri Padmavati Devi Temple at Tiruchanoor, the devotees were thrilled by the bouquet of cultural programs presented by the cultural teams hailing from other states  during majestic Kalpavruksha vahanam on Tuesday morning.

The cultural programs were organised by TTD HDPP, Dasa Sahitya, Annamacharya Projects, by inviting artists from other states to serve Goddess Padmavati during annual Brahmotsavams.

Maharashtra -Dol, Dakshina Karnataka- kolatas,Yaksha gana, Bharata Natham

The 20 member women team of Sri Rama bhajan mandali of Puttur of dakshina Kannada district of Karnataka presented a variety of programs like kolatas,Yaksha gana, Bharata Natham.

Bharatanatyam by Puduchery teams, potraying of various mythological characters by Abhinaya Natya Mandali of Hosur, Kolatas by Vizag team also stood as special attraction.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI 

 

కల్పవృక్ష వాహన‌సేవ‌లో ఆక‌ట్టుకున్నఇత‌ర రాష్ట్రాల కళాబృందాలు

తిరుపతి, 2019 న‌వంబ‌రు 26: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగ‌ళ‌వారం ఉదయం వివిధ‌ రాష్ట్రాల నుండి విచ్చేసిన క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శనలు ఆకట్టుకున్నాయి. టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్, దాస‌సాహిత్య ప్రాజెక్టు, అన్న‌మాచార్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో వాహ‌న‌సేవ‌ల్లో క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటుచేశారు.

మ‌హ‌రాష్ట్ర – డోల్ ప‌తాక్‌

మ‌హ‌రాష్ట్ర తుల్జాపూర్‌కు చెందిన ఎమిజి కాటిగ‌ర్ మ‌హ‌రాజ్‌ బృందంలోని 60 మంది మ‌హిళా క‌ళాకారులు ఉన్నారు. వీరు డ్ర‌మ్స్‌, తాళాలు ల‌య‌బ‌ద్ధంగా వాయిస్తూ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేశారు. ఈ వాయిద్య ప్ర‌ద‌ర్శ‌న ఎంతో విన‌సొంపుగా ఉంటుంది. వీరు గ‌త 24 సంవ‌త్స‌రాలుగా శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో వివిధ‌ వాహ‌న‌సేవ‌ల‌లో క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తున్నారు.

ద‌క్షిణ క‌ర్ణాట‌క – కోలాటం, య‌క్ష‌గానం, భ‌ర‌త‌నాట్యం

ద‌క్షిణ క‌ర్ణాట‌క పుత్తూరుకు చెందిన  శ్రీ రామ మ‌హిళా భ‌జ‌న మండ‌లిలోని  20 మంది బృందం అమ్మ‌వారి వాహ‌న‌సేవ‌లలో  కోలాటం, య‌క్ష‌గానం, భ‌ర‌త‌నాట్యం  ప్ర‌ద‌ర్శించింది. ఈ బృందంలోని క‌ళాకారులు శ్రీ‌వారి వాహ‌న‌సేవ‌ల‌లో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు. మొద‌టిసారిగా అమ్మ‌వారి వాహ‌న‌సేవ‌ల‌లో ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.

పాండిచ్చేరి – జ‌ల్రాటం మ‌రియు భ‌ర‌త‌నాట్యం
       
పాండిచ్చేరికి చెందిన పుదునై భ‌ర‌దాల‌యా భ‌జ‌న మండ‌లికి చెందిన 20 మంది మ‌హిళా బృందం జ‌ల్రాటం, భ‌ర‌త‌నాట్యం భ‌క్తుల‌ను ఆక‌ర్షిస్తున్నాయి.

హోసూరు – భ‌ర‌త‌నాట్యం

త‌మిళ‌నాడు హోసూరుకు చెందిన అభిన‌య నాట్యాల‌య డాన్స్ అకాడ‌మికి చెందిన 32 మంది క‌ళాకారులు ఉన్నారు. ఇందులో వివిధ‌ దేవ‌తా మూర్తుల అలంకారంతో చ‌క్క‌టి భ‌ర‌త‌నాట్యం ప్ర‌ద‌ర్శించారు.  

వైజ‌గ్ – కోలాటం

వైజాగ్‌కు చెందిన శ్రీ‌మ‌తి భ‌వాని ఆధ్వ‌ర్యంలో సీతారామ కోలాట స‌మితికి చెందిన 11 మంది మ‌హిళా బృందం చ‌క్క‌గా కోలాట నృత్యాన్ని ప్ర‌ద‌ర్శించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.