HIGHLIGHTS DURING TWO-YEAR TENURE OF SRI YV SUBBA REDDY AS TTD TRUST BOARD CHAIRMAN _ కాశ్మీర్ నుంచి క‌న్యాకుమారి దాకా పెద్ద ఎత్తున హిందూ ధ‌ర్మ ప్ర‌చారం _ – శ్రీ వైవి.సుబ్బారెడ్డి హ‌యాంలో తీసుకున్న కొన్ని ముఖ్య నిర్ణయాలు

Tirumala, 21 Jun. 21: As 50th Chairman of the TTD Trust Board, Sri YV Subba Reddy has successfully completed his two-year term on Monday.

A peep into the important development activities and pilgrim welfare decisions…

@Nod towards the construction of Balaji reservoir works to overcome the drinking water needs of Tirumala

@Introduction of electrical buses to protect the environs of Tirumala

@ Upon the instructions of Honourable CM of AP Sri YS Jaganmohan Reddy, L1, L2 and L3 were cancelled and preference given to common devotees.

@Garuda Varadhi to overcome traffic woes in Tirupati

@ SVIMS development on the lines of NIMS and also to take over the hospital

@ Srivari Bhaktidhamam in 200acres area at Alipiri

@Over the call of Honourable PM Sri Narendra Modi, Tirumala declared as No Plastic Zone and usage of plastic is completely banned in Tirumala. Alternate bio degradable bags in the place of plastic bags for laddus

@ Brahmotsavam Bahuman for Regular employees as Rs.14, 000, for Contract and outsourcing employees as Rs. 6,850

@Rein station of the services of retired archakas

@Construction of 500 temples in SC, ST, BC colonies with the funds of SRIVANI Trust

@Gold Malam works to Sri Varaha Swamy at Rs. 14crores

@ Srivari temple at Majhin village in Jammu and foundation stone laid on 13-06-2021

@Rs.30crores to construct Srivari temple in Mumbai and decision to construct a temple at Varanasi too

@ Termo-fluid containers at Rs. 3.30crores to avoid fire mishaps in Potu

@ Nod for tenders to set up 1300 CC Cameras for surveillance in Tirumala at Rs.20crores

@ A centre for specially-abled at Rs. 14crores and Deaf and Dumb School at Rs. 34crores coming up at SV Zoo Park

@Laying of pending Alipiri-Cherlopalle road at Rs.16crores

@ New OP and Additional operation Theatres at Rs. 8.43crores to BIRRD

@ Padmavathi temple at Rs. 3.92cr in GN Chetty road at Chennai

@Recruitment of 300 Security guards in different vacancies.

@ Exclusive Children’s Hospital

@ All Veda pathashalas in the state under one umbrella

@ Employees Health Scheme for employees

@ Payment of bills as per norms for employees towards Corona treatment in Private Hospitals

@ Opening of vaikunta dwaram of Tirumala temple for 10 days for the sake of devotees during vaikunta Ekadasi

@ Introduction of kalyanamasthu -Mass free marriages to poor once things turn to normalcy

@ No auction of land properties donated by devotees to TTD

@ With a goal to enhance revenue to TTD board decided to deposit cash and gold every month in time deposits in banks

@ Board also decided, to approach RBI and other banks to procure higher interest rates for TTD deposits

@ Board also decided to construct 50 special rooms on the 3rd floor of BIRRD administrative Bhavan at a cost of Rs.5.4 crore specially for kneecap transplant patients.

@ Rs.4.95 crore sanctioned to build a retainer wall to the ghat road of Divya kshstram at Visakhapatnam.

@ Gold plating of Surya Prabha vahana of Sri Padmavati temple in Tiruchanoor with 11.766 kgs of gold

@ Additional hostel block at SV Bala Mandir in Tirupati at a cost of ₹10 crore

@ TTD to build a Srivari temple at Ulundurupeta in Tamilnadu with a donation of 4 acres of land and Rs.10 crore by TTD board member Sri Kumaraguru

@ Soon to launch Kannada and Hindi SVBC channels

@ To overcome the effects of the Corona pandemic TTD has been organising various spiritual and devotional program programs at nadaneerajanam platform from the past 13 months in Tirumala including Sundarakanda parayanam, Bhagavad Gita, Virataparvam, yuddhakanda etc. All these programs are telecasted live on SVBC for the sake of global devotees

@ Covid measures taken during first and second waves

@ During the first wave, apart from providing Annaprasadam to migrants, stray cattle and dogs were also fed

@ Covid measures taken after resuming darshan to devotees

@ German Sheds arranged to facilitate Covid medicare to employees in a big way. All the employees and their families are given proper Medicare in all Covid care centres of TTD 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

కాశ్మీర్ నుంచి క‌న్యాకుమారి దాకా పెద్ద ఎత్తున హిందూ ధ‌ర్మ ప్ర‌చారం

– కోవిడ్ క‌ట్ట‌డికి స‌మ‌ర్థ‌వంత‌మైన చ‌ర్య‌లు

– సామాన్య భ‌క్తుల‌కు మ‌రింత సుల‌భంగా శ్రీ‌వారి ద‌ర్శ‌నం

– శ్రీ వైవి.సుబ్బారెడ్డి హ‌యాంలో తీసుకున్న కొన్ని ముఖ్య నిర్ణయాలు

తిరుమల, 2021 జూన్ 21: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌ముల ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులుగా శ్రీ వై.వి.సుబ్బారెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించి జూన్ 21వ తేదీ సోమ‌వారానికి రెండేళ్ళ‌య్యింది. శ్రీ సుబ్బారెడ్డి హ‌యాంలో క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కోవ‌డానికి స‌మ‌ర్థ‌వంత‌మైన చ‌ర్య‌లు తీసుకుంటూనే భ‌క్తుల‌కు ఉప‌యోగ‌ప‌డే అనేక అభివృద్ధి, హిందూ ధ‌ర్మ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ముందుకు తీసుకు వెళ్లారు. శ్రీ సుబ్బారెడ్డి నాయ‌క‌త్వంలోని ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి తీసుకున్న నిర్ణ‌యాల్లో ముఖ్య‌మైన‌వి ఇవీ….

– తిరుమలలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు బాలాజి రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం.

– తిరుమలలో పర్యావరణాన్ని కాపాడేందుకు ఎలక్ట్రిక్‌ బస్సులు, ఎలక్ట్రిక్‌ కార్లు ప్రవేశపెట్టాలని నిర్ణయం.

– ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడానికి ఎల్‌1, ఎల్‌2 దర్శనాలు రద్దు.

– తిరుపతిలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి నగర శివార్ల నుండే గరుడ వారధి ప్రారంభమయ్యేలా డిజైన్‌లో మార్పునకు నిర్ణయం.

– స్విమ్స్‌ను నిమ్స్‌ తరహాలో అభివృద్ధి చేయడానికి టిటిడి ఆధీనంలోకి తీసుకునేందుకు ఆమోదం.

– అలిపిరి వద్ద 200 ఎకరాల విస్తీర్ణంలో శ్రీవారి భక్తిధామం నిర్మించేందుకు నిర్ణయం.

– తిరుపతిలోనూ దశలవారీగా మద్యపాన నిషేధం అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి.

– ప్రధానమంత్రి శ్రీ.నరేంద్రమోడి పిలుపుమేరకు తిరుమలలో ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిషేధించేందుకు నిర్ణయం. ఇది అమలు జరుగుతోంది. స్వామివారి లడ్డూ ప్రసాదం తీసుకెళ్లేందుకు ప్లాస్టిక్‌ కవర్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం.

– టిటిడి రెగ్యులర్‌ ఉద్యోగులకు రూ.14 వేలు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు రూ.6,850/- బ్రహ్మోత్సవ బహుమానం అందించేందుకు నిర్ణయం.

– టిటిడిలో పదవీ విరమణ పొందిన అర్చకుల సేవలను తిరిగి వినియోగించుకునేలా నిర్ణయం.

– ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్రాల్లోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి ప్రాంతాల్ల్లో శ్రీవాణి ట్రస్టు ద్వారా 500 ఆలయాల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నాం.

– రూ.14 కోట్లతో తిరుమలలోని శ్రీ వరాహస్వామివారి ఆలయ విమానానికి రాగిరేకులపై బంగారు తాపడం పనులు తుది దశలో ఉన్నాయి.

– జమ్మూ సమీపంలోని మజీన్‌ గ్రామం వద్ద శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం 13-06-2021న భూమి పూజ చేశాం.

– ముంబయిలో రూ.30 కోట్లతో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఆమోదం. వార‌ణాశిలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి నిర్ణ‌యం.

– తిరుమలలోని బూందీ పోటులో అగ్నిప్రమాదాల నివారణ కోసం రూ.3.30 కోట్లతో అధునాతన థర్మోఫ్లూయిడ్‌ కడాయిలు నిర్మాణం పనులు పూర్తయ్యాయి.

– తిరుమలలో మూడో దశలో 1300 సిసి కెమెరాలు ఏర్పాటుకు రూ.20 కోట్లతో టెండర్లు పిలవడానికి ఆమోదం.

– తిరుపతి జూపార్కు సమీపంలో రూ.14 కోట్లతో ఎస్వీ ప్రత్యేక ప్రతిభావంతుల శిక్షణ సంస్థ, రూ.34 కోట్లతో ఎస్వీ బదిర పాఠశాల హాస్టల్‌ భవనాల నిర్మాణానికి ఆమోదం.

– అలిపిరి – చెర్లోపల్లి రోడ్డు విస్తరణలో మిగిలివున్న పనులను రూ.16 కోట్లతో పూర్తి చేసేందుకు ఆమోదం. ప్రస్తుతం ఈ పనులు నిర్మాణంలో ఉన్నాయి.

– బర్డ్‌ ఆసుపత్రిలోని నూతన ఓపి భవనంలో అదనపు ఆపరేషన్‌ థియేటర్ల నిర్మాణానికి రూ.8.43 కోట్లు మంజూరు.

– బర్డ్‌ ఆసుపత్రిలో వివిధ కేటగిరీల్లో అవసరమైన పోస్టులు సృష్టించేందుకు ప్రభుత్వానికి విన్నవించాలని నిర్ణయం.

– చెన్నైలోని జిఎన్‌ చెట్టి రోడ్డులో రూ.3.92 కోట్లతో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం.

– నిఘా భద్రతా విభాగంలో ఖాళీగా ఉన్న 300 సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేసేందుకు ఆమోదం.

– తిరుమలలో విశ్రాంతిగృహాల నిర్మాణానికి స్థలాల కేటాయింపు కోసం పారదర్శకంగా మార్గదర్శకాలు తయారు చేసి టెండర్లు ఆహ్వానించాం.

– టిటిడి ఆధ్వర్యంలో చిన్నపిల్లల కోసం సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం.

– రాష్ట్రంలోని వేద పాఠశాలలను ఒకే గొడుగు కిందకు తెచ్చి, వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కామన్‌ సిలబస్‌ తయారుచేసి ఒకే సర్టిఫికెట్‌ ఇవ్వాలని నిర్ణయం.

– టిటిడి ఉద్యోగులకు ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌) అమలు చేయాలని నిర్ణయం.

– కరోనా బారినపడిన టిటిడి ఉద్యోగులు ప్రైవేెట్‌ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటే నిబంధనల ప్రకారం బిల్లులు చెల్లింపునకు నిర్ణయం.

– తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కొరకు సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ను కొత్త టెక్నాలజితో అభివృద్ధి చేయాలని నిర్ణయించాం.

– ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢల్లీి రాష్ట్రాల్లో గుడికో గో మాత ప్రారంభించాం.

– టిటిడి ఆదాయం పెంచుకునే ఆలోచనలో భాగంగా ఇకమీదట నగదు, బంగారు డిపాజిట్లలో ప్రతి నెల కొంత మొత్తానికి గడువు తీరేలా బ్యాంకుల్లో జమ చేయాలని నిర్ణయం.

– బర్డ్‌ ఆసుపత్రిలో కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స చేసుకున్న వారి కోసం రూ. 5.4 కోట్లతో 50 ప్రత్యేక గదుల నిర్మాణానికి ఆమోదం.

– తిరుమల శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాన్ని పది రోజుల పాటు తెరచి ఉంచాలని నిర్ణయం తీసుకుని అమలు చేశాం.

– కల్యాణమస్తు సామూహిక వివాహ కార్యక్రమాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయం. కోవిడ్‌ కారణంగా ఈ కార్యక్రమం అమలు అలస్యం అవుతోంది.

– శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చిన ఆస్తులను విక్రయించరాదని 28-05-2020న జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం నిర్ణయం తీసుకుంది.

– దేశవ్యాప్తంగా స్వామివారికి చెందిన 1128 ఆస్తులకు సంబంధించిన 8088.89 ఎకరాల భూములపై ఈరోజు శ్వేతపత్రం విడుదల చేశాం. ఆక్రమణలు, ఉపయోగం లేనివాటిని ఎలా ఉపయోగించాలి అనే విషయంపై కమిటీ వేశాం. కమిటీ నివేదిక మేరకు తగు నిర్ణయం తీసుకుంటాం.

– తిరుమల శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభం, బలిపీఠం, మహద్వారం తలుపులకు బంగారు తాపడం చేయించాలని నిర్ణయం.

– టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ద్వారా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవాన్ని ప్రచారం చేయడానికి కొత్తగా 6 ప్రచార రథాలు కొనుగోలుకు ఆమోదం తెలిపాం.

– తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని సూర్యప్రభ వాహనానికి 11.766 కిలోల బంగారంతో తాపడం చేయించడానికి అమోదించాం.

– తిరుపతి ఎస్వీ బాలమందిరంలో రూ.10 కోట్లతో అదనపు హాస్టల్‌ బ్లాక్‌ నిర్మాణం.

– తమిళనాడులోని ఊలందూరుపేటలో శ్రీవారి ఆలయం నిర్మాణానికి భూమి పూజ చేశాం.

– టీటీడీ ఆధ్వర్యంలోని ఆరు వేద పాఠశాలల పేరును ఇకపై శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంగా మార్చేందుకు ఆమోదం.

– ప్రసాదాలు, అన్నప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యి ట్యాంకుల సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 82.4 మెట్రిక్‌ టన్నుల నుండి 180. 4 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యానికి పెంచేందుకు ఆమోదం.

– తిరుమలలోని వసతి, విశ్రాంతి గృహాలు, సత్రాల వద్ద APSPDCL ద్వారా విద్యుత్‌ మీటర్ల ఏర్పాటుకు ఆమోదం. తిరుమలలో 50 మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తికి నిర్ణయం.

– తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రవేశ పెట్టేందుకు ఆమోదం.

– టీటీడిలోకి ఇతర ఆలయాలను విలీనం చేసుకోరాదని నిర్ణయం.

– ప్రజలకు బాగా ఉపయోగపడే ప్రాంతాల్లోనే అవసరం అనుకుంటే మాత్రమే కొత్తగా కల్యాణ మండపాల నిర్మాణానికి నిర్ణయం.

– అయోధ్యలో రామమందిర నిర్మాణ ట్రస్ట్‌ భూమి కేటాయిస్తే శ్రీవారి ఆలయం, భజన మందిరం, యాత్రికుల వసతి సముదాయాల్లో వారు ఏది కోరితే అది నిర్మించాలని నిర్ణయం.

– రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి ప్రాంతాల్లో శ్రీవాణి ట్రస్టు నిధులతో నిర్మించదలచిన 500 ఆలయాలను ఏడాదిలో పూర్తి చేసేలా తీర్మానం.

– జమ్మూలో ఇటీవల భూమిపూజ చేసిన శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేసి ఉత్తర భారతదేశంలో గొప్ప ఆలయంగా తయారుచేసేందుకు నిర్ణయం.

– తిరుమల శ్రీ వరాహస్వామివారి ఆలయం వాకిలి, వాకిలిచట్రం, గర్భగృహ ప్రవేశద్వారాలకు వెండి తొడుగులు అమర్చేందుకు నిర్ణయం.

– గోవిందుడికి గో ఆధారిత నైవేద్యం కార్యక్రమం కింద సహజ ఆధారిత పంటలతో స్వామివారికి తయారు చేస్తున్న నైవేద్యాల కార్యక్రమాన్ని శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయం.

– మూడు నెలల్లోపు ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్ల ప్రసారాలు ప్రారంభించాలని నిర్ణయం.

– దేశవ్యాప్తంగా అవసరమైన ప్రాంతాల్లో దేవాలయాల పునరుద్ధరణకు శ్రీవాణి ట్రస్టు ద్వారా నిధులు అందిస్తాం.

– టిటిడిలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడానికి ఇదివరకే కమిటీని నియమించాం. విధి విధానాలతో మూడు నెలల్లో కమిటీ నివేదిక అందిస్తుంది. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల్లో భాగంగా దీన్ని అమలుచేస్తాం.

– త్వరలో ముఖ్యమంత్రి చేతులమీదుగా స్విమ్స్‌, బర్డ్‌ ఆస్పత్రుల అభివృద్ధి పనులతో పాటు చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన, తిరుమలలో కొత్తగా నిర్మించిన బూందీ పోటు ప్రారంభోత్సవం.

– తిరుమలలోని హనుమంతుని జన్మస్థలాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం. ఈ అంశంపై ఇక మీదట ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వరాదని తీర్మానం.

– తిరుపతిలో ట్రాఫిక్‌ సమస్య శాశ్వత పరిష్కారం కోసం శాసనసభ్యులు
శ్రీ భూమన కరుణాకరరెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రస్తుతం ఆగిన చోట నుండి అలిపిరి వరకు గరుడ వారధి నిర్మాణానికి ఆమోదం. టిటిడి నిధులతో ఈ వారధి నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవాలని నిర్ణయం.

– తిరుమలను గ్రీన్‌హిల్స్‌గా ప్రకటించినందున ఉచిత బస్సుల స్థానంలో త్వరలో విద్యుత్‌ బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయం.

కోవిడ్‌ సమయంలో :

– కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో తిరుపతి పరిసర ప్రాంతాల్లోని వలస కూలీల ఆకలి తీర్చడం కోసం సుమారు 35.50 లక్షల అన్నప్రసాదం ప్యాకెట్లు పంపిణీ చేశాము.

– లాక్‌డౌన్‌ సమయంలో ఎస్వీ గోసంరక్షణశాల ద్వారా తిరుపతిలోని వీధి పశువుల ఆకలి తీర్చడానికి మేత అందించాం. తిరుపతిలోని టిటిడి క్యాంటీన్‌ నుంచి వీధి కుక్కల ఆకలి తీర్చడానికి ఆహారం పంపిణీ చేశాం.

– లాక్‌డౌన్‌ సమయంలో తిరుపతిలోని ఎస్వీ జూపార్క్‌లో వన్యప్రాణుల సంరక్షణ, వాటి ఆహారం కోసం రూ.50 లక్షలు ఆర్థికసాయం.

– తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, పద్మావతి నిలయం, గోవిందరాజస్వామి సత్రాలు కోవిడ్‌ కేర్‌ సెంటర్ల నిర్వహణ కొరకు జిల్లా యంత్రాంగానికి అప్పగించాం. ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రిని కోవిడ్‌ ఆసుపత్రిగా మార్చాం.

– శ్రీ పద్మావతి కోవిడ్‌ ఆసుపత్రిలో వెంటిలేటర్లు, ఇతర పరికరాల కొనుగోలు కోసం జిల్లా యంత్రాంగానికి రూ.19 కోట్లు అందించాం.

– కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, ఆసుపత్రుల్లోని రోగులకు భోజనం అందించాం.

– రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ భాదితులను ఆదుకోవడం కోసం జిల్లా యంత్రాంగాల ద్వారా వివిధ ప్రాంతాల్లో 22 జర్మన్‌ షెడ్లు ఏర్పాటు చేయడానికి ఆర్థిక సహాయం అందించాం.

– కోవిడ్‌ రెండవ దశ వ్యాప్తి సమయంలో టిటిడి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా బర్డ్‌ ఆసుపత్రిని కోవిడ్‌ ఆసుపత్రిగా మార్చాం. ఇందులో 140 అక్సిజన్‌ బెడ్లు, 14 వెంటిలేటర్లు ఏర్పాటు చేశాం. మాధవం విశ్రాంతి భవనాన్ని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌గా నిర్వహించాం.

– టీటీడీ ఉద్యోగులందరికీ డాక్టర్ల సూచనలు పాటిస్తూ కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించేందుకు తీర్మానం.

– కోవిడ్‌ బారిన పడిన ఉద్యోగులు ప్రయివేటు ఆసుపత్రుల్లో తీసుకున్న చికిత్సకు రూ.5 లక్షల వరకు బిల్లుల చెల్లింపు.
– 50ః50 నిష్పత్తిలో కార్యాలయ విధులకు అనుమతి. ప్రత్యేక అవసరాలున్న వారికి ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు.

– రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లో గల టిటిడి కల్యాణమండపాల్లో భక్తులకు శ్రీవారి లడ్డూప్రసాదం పంపిణీ.

– తిరుమల శ్రీవారి దర్శనానికి ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో పొందిన భక్తులకు తమ దర్శన తేదీలు మార్చుకునే వెసులుబాటు. రద్దు చేసుకుంటే నగదు రీఫండ్‌ పొందే సౌకర్యం.

– ప్ర‌జ‌లంద‌రిని క‌రోనా బారిన ప‌డ‌కుండా కాపాడాల‌ని శ్రీవారిని ప్రార్థిస్తూ సుందరకాండ పారాయణం, విరాటపర్వం, భ‌గ‌వ‌ద్గీత లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించాం. వీటిని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్షప్రసారం చేశాం. ఇప్ప‌టికీ కొన‌సాగుతున్న కార్య‌క్ర‌మాల‌ను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్షప్రసారం చేస్తూనే ఉన్నాం.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.