క‌ల్ప‌వృక్ష వాహనంపై స‌ప్త‌గిరీశుడి రాజ‌సం

క‌ల్ప‌వృక్ష వాహనంపై స‌ప్త‌గిరీశుడి రాజ‌సం

తిరుమల, 2022 ఫిబ్ర‌వ‌రి 08: రథసప్తమి సంద‌ర్బంగా మంగ‌ళ‌వారం సాయంత్రం 4 నుండి 5 గంటల వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో స‌ప్త‌గిరీశుడైన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు శ్రీ‌దేవి, భూదేవి స‌మేతంగా క‌ల్ప‌వృక్ష వాహనంపై అభ‌య‌మిచ్చారు.

క‌ల్ప‌వృక్ష వాహ‌నం – ఐహిక ఫ‌ల ప్రాప్తి

 కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తూ కల్పవృక్షం ఇవ్వలేని ధర్మమోక్షాల్ని కూడా నేను అనుగ్రహిస్తానని శ్రీ‌వారు నిరూపిస్తున్నారు. కల్పవృక్షాలు లోకాతీతమైన ఏ ఫలాన్నయినా ఇస్తాయి. ఇవి కోరుకునేవారి తెలివిని బట్టి లభిస్తాయి. శ్రీదేవి, భూదేవి ఇహలోక ఫలాలిస్తారు. శ్రీవారు దివ్యలోకఫలాలు, ముక్తిని ప్రసాదిస్తారు. కనుక కల్పవృక్ష వాహనోత్సవ సేవ ఇహపరఫల ఆనందదాయకం.

టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు శ్రీ కాట‌సాని రాంభూపాల్ రెడ్డి,  శ్రీ మ‌ధుసూద‌న్ యాద‌వ్‌, శ్రీ మారుతి ప్ర‌సాద్, శ్రీ రాములు, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, ఢిల్లీ స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షురాలు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి దంప‌తులు, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఎస్ఇ – 2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు ఈ వాహ‌న సేవ‌లో పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.