GARUDA VAHANA SEVA OBSERVED _ గరుడ వాహనంపై సకలలోక రక్షకుడు శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌రుడు

Tirupati, 6 Mar. 21: On the fifth day evening as part of ongoing Brahmotsavams of Sri Kalyana Venkateswara Swamy Temple at Srinivasa Mangapuram, the most glittering and auspicious event Garuda Seva was observed on Saturday night with religious fervour.

Legends and Puranas say that devotees who get darshan of Sri Venkateswara on His favorite Garuda vahana will be blessed with health and prosperity forever.

CVSO Sri Gopinath Jatti, DyEO Smt Shanti, and AEO Sri Dhananjayulu were present.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గరుడ వాహనంపై సకలలోక రక్షకుడు శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌రుడు

తిరుపతి, 2021 మార్చి 06: శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శ‌నివారం రాత్రి సకలలోక రక్షకుడైన శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌రస్వామి తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గ‌రుడ వాహనంపై అనుగ్రహించారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

ముందుగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి లక్ష్మీ కాసులహారాన్ని అధికారులు ఆలయం వద్దకు తీసుకొచ్చి డెప్యూటీ ఈఓ శ్రీమతి శాంతికి అందించారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ, శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం విశిష్టత ఏర్పడ్డాయి.

ఈ కార్యక్రమంలో సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యుడు, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగల్రాయలు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.