BIRTH ANNIVERSARY OF LEGENDARY SCHOLAR OBSERVED _ ఘనంగా శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 135వ జయంతి

Tirupati, 07 February 2022: The 135th Birth Anniversary of Sri Veturi Prabhakara Shastry, the architect who popularized Srivaru in the world of Bhakti by transcribing the Annamacharya sankeertans.

 

The life-size bronze statue of Sri Sastry at SVETA and in SV Oriental College was garlanded by Devasthanams Education Officer Sri Govindarajan.

 

Later the Principal of the college Sri Narayana Swamy Reddy presided over the meeting arranged in memory of Sri Veturi Prabhakara Sastry. Eminent speakers including Sri Venugopal, Smt Varadan Chandra, Sri Madugula Anil Kumar recalled the valuable services of the late legendary scholar.

 

Students and faculty of the college participated.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఘనంగా శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 135వ జయంతి

తిరుప‌తి, 2022 ఫిబ్ర‌వ‌రి 07: శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 135వ జయంతి కార్యక్రమం సోమవారం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా శ్వేత భవనం దగ్గర ఉన్న శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి విగ్రహానికి, ప్రాచ్య కళాశాలలో ఉన్న వేటూరి వారి విగ్రహానికి టిటిడి విద్యాశాఖాధికారి శ్రీ సి.గోవిందరాజన్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. నారాయణ స్వామి రెడ్డి, అధ్యాపకులు విద్యార్థులు పుష్ప మాలలు సమర్పించారు.

మధ్యాహ్నం కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్షతన స్మారకోపన్యాస సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభాకర మిత్ర మండలి సభ్యులు శ్రీ ఎం.వేణుగోపాల్, కళాశాల పూర్వ విద్యార్థి శ్రీమతి వరదన్ చంద్ర అతిథులుగా విచ్చేసి వేటూరి వారి గురించి విద్యార్థులకు సందేశాన్ని ఇచ్చారు. అలాగే తెలుగు విభాగాధ్యక్షులు శ్రీ కె.లక్ష్మీనారాయణ, సంస్కృత విభాగాధ్యక్షులు డాక్టర్ మాడుగుల అనిల్ కుమార్, కళాశాల అధ్యాపకులు విద్యార్థులను ఉద్దేశించి తమ సందేశాన్ని ఇచ్చారు. విద్యార్థులు ఆసాంతం ఉపన్యాసాలు శ్రద్ధగా ఆలకించారు. వేటూరి ప్రభాకర శాస్త్రి గారి గురించి నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలైన వారికి అతిథులచే బహుమతి ప్రదానం జరిగింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.