PAVITROTSAVAMS COMMENCE GRANDLY AT SRINIVASA MANGAPURAM TEMPLE _ వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం
Tirupati | November 05, 2026: The annual Pavitrotsavams of Sri Kalyana Venkateswara Swamy Temple at Srinivasa Mangapuram commenced grandly on Thursday.
Special rituals, including Punyahavachanam, Raksha Bandhanam and Snapana Tirumanjanam, were performed to the processional deities of the Lord and His consorts. Special abhishekam was performed with milk, curd, honey, coconut water, turmeric and sandalwood paste. Pavitra Pratishtha was performed in the evening.
TTD JEO Dr. A. Sharath, Temple Dy. EO Smt. Varalakshmi, temple officials, priests and devotees participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2026 నవంబరు 05: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఉదయం 8.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివార్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాల్లో భాగంగా పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, రక్షాబంధనం, అన్నప్రానాయానం నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 11 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.
అనంతరం రాత్రి 7 గంటలకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ.శరత్, ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈఓ శ్రీ గోపీనాథ్, సూపరింటెండెంట్ శ్రీ హరికృష్ణ, ఆర్జితం ఇన్స్పెక్టర్ శ్రీ ధనశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.







