DARBAR KRISHNA SHINES ON CHANDRAPRABHA _ చంద్ర‌ప్ర‌భ‌ వాహ‌నంపై ద‌ర్బార్ కృష్ణుడి అలంకారంలో శ్రీ కల్యాణ వెంకన్న

Tirupati, 8 Mar. 21: Darbar Krishna seated majestically on Chandraprabha vahana held in Ekantam during the ongoing brahmotsavams at Srinivasa Mangapuram. 

On Monday evening Darbar Krishna blessed His devotees on the soothing Chandraprabha carrier. 

Temple DyEO Smt Shanti and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

చంద్ర‌ప్ర‌భ‌ వాహ‌నంపై ద‌ర్బార్ కృష్ణుడి అలంకారంలో శ్రీ కల్యాణ వెంకన్న

తిరుపతి, 2021 మార్చి 08: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం రాత్రి స్వామివారు ద‌ర్బార్ కృష్ణుడి అలంకారంలో చంద్ర‌ప్రభ వాహనంపై కటాక్షించారు.

నక్షత్రాలకు చంద్రుడు అధిపతి అయితే శ్రీవారు సమస్త విశ్వానికీ అధిపతి. వాహనం చంద్రుడు ఆహ్లాదకారి. శ్రీవారు చంద్రమండల మధ్యస్థుడై పరమాహ్లాదకారి అయ్యాడు. సర్వకళాసమాహారాత్మకుడైన ఆదినారాయణుడు తన కళల నుండి 16 కళలు చంద్రునిపై ప్రసరింపజేసినందున చంద్రుడు కళానిధి అయ్యాడు. చంద్రదర్శనంతో సముద్రం ఉప్పొంగినట్టు, చంద్రప్రభామధ్యస్థుడైన శ్రీకల్యాణచంద్రుణ్ణి దర్శించడంతో భక్తుల హృదయ క్షీరసాగరాలు ఉత్తుంగప్రమోద తరంగాలతో పొంగి ఆనందిస్తాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యుడు, సూపరింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయ‌లు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.